Murali Krishna, News18, Kurnool
రేణుకా దేవి టిఫెన్ సెంటర్. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు (Kurnool) వాసులకు సుపరిచితమైన పేరు. ఆ రోజు ఇంట్లో ఏం టిఫెన్ చేయలేదా? పని మీద బయటకు వచ్చి ఆలస్యమయ్యిందా? ఛలో రేణుకాదేవి టిఫెన్ సెంటర్ అంటారు కర్నూలు వాసులు. ఎందుకంటే అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ టిఫెన్ దొరుకుతుంది. సాధారణంగా టిఫిన్ సెంటర్లు మొబైల్ క్యాంటీన్ ఇలా ఎక్కడ చూసినా హోటళ్లు.. ఒక్కో దాంట్లో ఒక్కో రేటు. ఏ టిఫెన్కు ఆ టిఫెన్ రేటు వేరుగా ఉంటుంది. ఇడ్లీ రేటు 30 రూపాయలు ఉంటే..దోశ రేటు 50రూపాయలు. అంతేనా ఒక చోట ఇడ్లీ ప్లేటు 30 రూపాయలు ఉంటే, మరో చోట 60, ఇంకో చోట ఏకంగా 250 ఉంటుంది. కానీ ఈ టిఫెన్ సెంటర్లో ఏ టిఫెన్ అయినా అక్షరాల పదిరూపాయలే సుమీ.
వీటన్నిటికి భిన్నంగా గత 13 సంవత్సరాలుగా కర్నూలులోని రోజా వీధికి చెందిన రేణుక దేవి అనే టిఫిన్ సెంటర్ కస్టమర్లకు అందుబాటు ధరల్లో టిఫెన్ అందిస్తున్నాయి. ఈ టిఫిన్ సెంటర్లో ఏ టిఫిన్ ఐనా కేవలం 10 రూపాయలు మాత్రమే. రేటు తక్కువ కదా అక్కడ క్వాలిటీ, క్వాంటిటీపై ఏమైనా డౌటు పడుతున్నారా.. అందులో ఎలాంటి సందేహం వద్దు. రుచిలో ఏ మాత్రంతీసిపోకుండా ఇతర హోటలకు ధీటుగా ఇక్కడ టిఫెన్ ఉంటుంది.
ఇక్కడ దాదాపుగా 18 మంది పని చేస్తూ హోటల్ నడుపుతున్నారు. వీరంతా ఉదయం 6 గంటలకే హోటల్ తెరిచి టిఫిన్స్ రెడీ చేసి పెడతారు. అన్ని హోటల్స్ లాగే ఇక్కడ కూడా ఇడ్లీ, వడ, దోసె, పూరి,మైసూర్ బోండా, ఉగ్గాని బజ్జిలు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచే కస్టమర్స్ రావడం మొదలు పెడతారు. ఉదయం నుంచి 12 గంటల వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు హోటల్ నిర్వహిస్తారు.
అంతేకాదు హోటల్ ప్రారంభించినప్పటి నుంచి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు. హోటల్ కి వచ్చే కస్టమర్స్ సైతం ఇక్కడ టిఫిన్స్ చాలా రుచికరంగాను, నాణ్యంగా ఉంటాయంటూ కితాబునిస్తున్నారు. ఇంతటి రుచికరమైన టిఫిన్స్ ఇంత తక్కువ ధరలో అందిచడం చాలా సంతోషం అంటూ హోటల్ నిర్వాహకులను అభినందిస్తున్నారు.
ఇది చదవండి: వైజాగ్ లో మినీ తాజ్ మహల్..! హిస్టరీ తెలిస్తే వావ్ అంటారు..!
బయట సరుకుల ధరలు ఎంత పెరిగిన ఇక్కడ టిఫిన్స్ ధరలు మాత్రం ఇప్పుడు 10 రూపాయలే ఉంటుంది అని చెబుతున్నారు. కేవలం స్థానికులే కాకుండా విద్యార్థులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తుంటారట. ఇక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool