KURNOOL ADMISSIONS STARTED IN KURNOOL URDU UNIVERSITY TAKE A LOOK AT PROCESS AND FEE DETAILS PRN KNL NJ
Urdu University: ఏపీలో ఏకైక ఉర్దూ యూనివర్సిటీ ఇదే..! అడ్మిషన్, ఫీజ్ వివరాలు ఇలా..!
కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన జిల్లాగా కర్నూలు (Kurnool) కు గుర్తింపు ఉంది. రాష్ట్ర ముస్లిం జనాభాలో అత్యధికంగా 10 శాతం (16 లక్షల మంది) కేవలం కర్నూలు జిల్లాలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే A.P. స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్ - 2016 ప్రకారం అక్కడ ఉర్ధూ యూనివర్సిటీని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన జిల్లాగా కర్నూలు (Kurnool) కు గుర్తింపు ఉంది. రాష్ట్ర ముస్లిం జనాభాలో అత్యధికంగా 10 శాతం (16 లక్షల మంది) కేవలం కర్నూలు జిల్లాలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే A.P. స్టేట్ లెజిస్లేచర్ యాక్ట్ - 2016 ప్రకారం అక్కడ ఉర్ధూ యూనివర్సిటీని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ భాషా అభివృధ్ధికి సేవలందించిన ఉస్మానియా విద్యాలయ వ్యవస్థాపకులు డాక్టర్ అబ్దుల్ హక్ స్మారకంగా కర్నూలులో ఆయన పేరుతో ఉర్దూ యూనివర్సిటీని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం ఉర్దూ భాషను ప్రోత్సహించడం.. దాన్ని అభివృద్ధి చేయడం. వృత్తి మరియు సాంకేతిక అంశాలలో ఉర్దూ మాధ్యమం ద్వారా విద్య మరియు శిక్షణను అందిస్తోంది. ఉర్దూ మాధ్యమంలో ఉన్నత విద్య మరియు శిక్షణ కార్యక్రమాలను అభ్యసించాలనుకునే వ్యక్తులకు ఈ క్యాంపస్ ఆహ్వానం పలుకుతోంది.
అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యా సంస్థలతో రాయలసీమ ప్రాంతం విద్యా రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమై ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో బోధనను అమలు చేస్తూ ఈ విశ్వవిద్యాలయం ముందుగు సాగుతోంది. 76 మందితో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం 500 మందికి పైగా విద్యార్ధులను కలిగి ఉండటం పురోగతికి నిదర్శనం. భాష, సంస్కృతులను పరిరక్షించాలనే లక్ష్యంతో స్థాపించబడిన సంస్థలకు ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రతీకగా నిలుస్తోంది.
QAMDC(Online) :
Course
Seats
Course
B.A(HEP)
60
5360/-
B.A(HUP)
60
5360/-
B. Com (C.A)
60
5360/-
B.Sc. (MSCs)
50
7640/-
5yr Integrated M. Sc-Botany
40
7640/-
5 Year Integrated M. Sc-Zoology
40
7640/-
APPGCER(Online):
Course
Seats
Course
M.Com
30
9,320/-
M.A. Urdu
30
8,330/-
M.A English
30
8,330/-
M.A. Economics
30
8,330/-
M.Sc. Computer Science
30
25,400/-
M.A. Social work
30
8,330/-
APICET(Online)
Course
Seats
Tuition fee
M.B.A
60
14,200
జగనన్న విద్యా దీవేనె, జగనన్న వసతీ దీవెన, National Scholarship Portal, Ministry of Electronics and Information Technology. పథకాల కింద విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్లు కూడా ఇక్కడ విద్యార్థులకు అందుతాయి.
ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న యూనివర్సిటీ.. మరో రెండేళ్లలో సొంతభవనానికి!
యూనివర్శిటీ ఏర్పాటై ఆరేళ్లు పూర్తవుతున్నా..ఇంకా అద్దె భవనంలోనే యూనివర్సిటీ నడుపుతున్నారు. 2016లో ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. కాగా 2017లో రూ.175 కోట్ల అంచనాలతో 200 ఎకరాల్లో పూర్తిస్థాయి ఉర్ధూ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రణాళికలను రచించారు. తక్షణ అవసరంగా రూ. 1.75 కోట్లను విడుదల చేసింది. అందులో భాగంగా ఓర్వకల్లు సమీపంలోని రాక్ గార్డెన్ ఎదురుగా భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో రెండేళ్లలో ఈ అద్దె భవనం వీడి సొంత భవనానికి వెళ్తామని వీసీ రెహ్మాన్ తెలిపారు. </span></span></span>
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.