Murali Krishna, News18, Kurnool
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక, చాలి చాలని జీతంతో జీవన పోరాటం చేస్తున్న నిరుద్యోగులు ఒక వైపు... ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి నెల నెల కచ్చితంగా జీతం పొందుతూ అది చాలక అక్రమ సంపాదనకు ఆశ పడి అవినీతి శాఖ అధికారులకు చిక్కి కటకటాలపాలవుతున్న ఉద్యోగులు ఎందరో ఉన్నారు. అవినీతి అధికారిగా పేరును సంపాదించుకుంటున్నారు మరికొందరు. అలాంటి సంఘటనే కర్నూలులో జరిగింది. కర్నూలు పట్టణంలోని రూరల్ తహశీల్ధార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులుబాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు.
కర్నూలు రూరల్ మండలం నిర్జురు గ్రామనికి చెందిన ఒక రైతుకు చెందిన 33 సెంట్ల పొలాన్ని ల్యాండ్ కన్వార్సన్ చేసేందుకు సంబంధిత రైతు నుంచి 1.60 వేల రూపాయలును కర్నూలు రూరల్ తహశీల్దార్ కార్యాలయం రూరల్ ఆర్ఐవిజయ్ కుమార్, మండలం సర్వేయర్ జిలాని బాషా లంచం డిమాండ్ చేశారు.
దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సరిగ్గా రైతు సర్వేయర్, ఆర్.ఐకు నగదును ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఆ రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక లక్ష 60వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడిలో భాగంగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పట్టుబడిన వారిని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీశివన్నారాయణ స్వామి మీడియాకు వివరించారు. అదేవిధంగా ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేసిన వెంటనే 14400 అనే ఫోన్ యాప్ ద్వారా గాని 14400 అనే నంబర్కు కానీ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Andhra Pradesh, Kurnool, Local News