(T. Murali Krishna, News18, Kurnool)
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తూ అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ.. అవినీతికి పాల్పడినటువంటి అధికారులపై కొరడా ఝలిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ డిఎస్పి శివన్నారాయణ స్వామి నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం అవినీతికి పాల్పడే అధికారులపై ప్రత్యేక నిఘా ఉంచి పక్కా సమాచారంతో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
ఇలా నిత్యం జిల్లావ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి వారిని కటకటాలోకి తోసిన కొంతమందిలో మాత్రం ఇలాంటి మార్పు రావడం లేదు.గడిచిన రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 10 పదిమందికి పైగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారిపై పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు.
ఇప్పటికే నంద్యాల ఎస్ ఆర్ బి సి ఏఈ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలో అతని ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించి... వారి వద్ద నుంచి విలువైన ఆస్తి పత్రలను భారీ మొత్తంలో నగదు డబ్బును బంగారు నగలను జప్తూ చేసారు. అదే విదంగా కర్నూలు రూరల్ తాసిల్దార్ కార్యాలయం పై దాడుల నిర్వహించి ఓ రైతు నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా. మండల సర్వేయర్ మరియు విఆర్ఓ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇలా నిత్యం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న కొంతమందిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు...
తాజాగా కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేపట్టారు. లంచం తీసుకుంటున్న ఒప్పంద ఉద్యోగి షఫీని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకోవాలని సూచించిన చిన్న పెండేకల్లు పంచాయతీ కార్యదర్శి మల్లయ్యపై కేసు నమోదు చేశారు.
ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామానికి చెందిన గురు రాజారెడ్డికి గ్రామంలో వంశపారపర్యంగా వస్తున్నటువంటి మూడు సెంట్లు స్థలం ఉంది. దాన్ని విక్రయించాలనుకున్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం వెళ్తే స్థలం విక్రయించాలంటే పంచాయతీ కార్యదర్శి నుంచి నో అబ్జెక్షన్ ఆర్డర్ తీసుకురావాలని అధికారులు అతనికి తెలిపారు.
దీంతో గురు రాజారెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి సంప్రదించగా అతను అందుకురూ. 7000 లంచం అడిగారన్నారు. అంత డబ్బు ఇవ్వలేననిబాధితుడు తెలపడంతో నాలుగు వేలకు బేరం కుదిరించుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా పక్కా సమాచారంతో దాడుల నిర్వహించి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులపై సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో దాడులు నిర్వహించి అధికారులను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News