హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సోదాలు...

Kurnool: నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అధికారుల సోదాలు...

X
అధికారుల

అధికారుల సోదాలు

Andhra Pradesh: ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారుల అవినీతి బాగోతాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి.డబ్బులిస్తే చాలు ఎలాంటి పనినైనా ఏ అనుమతులు లేకుండా చేసేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(T. Murali Krishna, News18, Kurnool)

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారుల అవినీతి బాగోతాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి.డబ్బులిస్తే చాలు ఎలాంటి పనినైనా ఏ అనుమతులు లేకుండా చేసేస్తున్నారు. రైతుల భూములను సైతం పట్టాలో ఉన్నవారి పేరును మార్చి అక్రమార్కుల పేర్లు చేర్చి నాయకులకు దోచిపెడుతున్నారు. అధికారుల అండదండలు చూసుకుని ఇలాంటి అక్రమాలను యధేచ్చగా సాగిస్తున్నారు.

తాజాగా కర్నూలు జిల్లాలో ఇటీవల మండల రెవెన్యూ కార్యాలయంలో ఐదు మంది అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కానీ అందులో సర్వేయర్ వీఆర్వో పేర్లను మాత్రం చేర్చి ఉన్నతాధికారులు తప్పించుకున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా వీళ్లఅవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుంది.

ఇటీవల నంద్యాల జిల్లాలో SRBCSCఇంటిపై సోదాలు నిర్వహించి ఆ అధికారి దగ్గర నుంచి విలువైన పత్రాలు బంగారు ఆభరణాలు నవదు డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అది జరిగి నెలరోజులు కూడా గడప ముందే ఇలాంటి ఉదాంతమే నంద్యాల జిల్లా మున్సిపల్ కార్యాలయంలో అధికారులు తమ చేతివాటం చూపిస్తుండడంతో విసుగెత్తిన జనాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా. ఏసీబీ డిఎస్పి శివన్నారాయణ నేతృత్వంలో.నంద్యాల జిల్లా లోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిత దాడులు చేసి సోదాలు నిర్వహించారు.

మున్సిపల్ కార్యాలయంలోని సెక్షన్ మరియు రెవెన్యూ సెక్షన్ లలో సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీశివన్నారాయణ మాట్లాడుతూ కొంతమంది ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పనుల చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణల కారణంగా ఈ దాడులు నిర్వహించామని తెలిపారు.

అదేవిధంగా రాబడిన సమాచారం మేరకు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో బిల్లింగ్ కట్టుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతుల కోరిన వారికి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా వాటికి సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఆయన లంచం అడిగితే 14400 కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు