Home /News /andhra-pradesh /

KURNOOL A YOUNG MAN WHO ATTEMPTED TO KILL A MINOR GIRL BECAUSE SHE DID NOT LOVE HIM IN KURNOOL DISTRICT NGS KNL BRV

Kurnool: మైనర్ బాలిక ప్రేమకు అంగీకరించలేదని.. దారుణానికి ఒడిగట్టిన యువకుడు.. ఏం చేశాడంటే?

ప్రేమించలేదని మైనర్ పై అత్యాచారం

ప్రేమించలేదని మైనర్ పై అత్యాచారం

Crime News: ప్రేమ పేరుతో వేధింపులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. కనీసం మైనర్ బాలికలను కూడా కీచకలు వదలడం లేదు. ప్రేమకు అంగీకరించలేదనే కారణంతో ఓ మైనర్ పై దారుణానికి ఒడిగట్టాడు ఓ యువకుడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    T.Murali Krishna, News 18, Kurnool.

    Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కీచకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మైనర్లను కూడా వదలడం లేదు.. ప్రేమ పేరు (Love Harassment) తో వేధింపులకు దిగుతున్నారు. కుదరని చెప్పినా.. కనీసం సమాధానం చెప్పకపోయినా వారిని వదలడం లేదు. తాజాగా  మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ, ఆ బాలికపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈఘటన కర్నూల్ జిల్లా (Kurnool District) తుగ్గలి మండల పరిధిలోని ఎద్దుల దొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం ఎద్దుల దొడ్డి గ్రామానికి చెందిన తలారి సూరి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు.  తనను ప్రేమించలేదని బాలికపై కక్ష కట్టాడు.

    సోమవారం బాలిక తమ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న తలారి సూరి.. తనను ప్రేమించాలని పట్టుపట్టాడు. బాలిక ఒప్పుకోకపోవడంతో బాలిక నోట్లో బట్టలు కుక్కి, గొంతు నులిమి హత్య చేయబోతుండగా ఆ బాలిక కేకలు వేసింది. దీంతో పొరుగింటి వారు వచ్చి బాలికను రక్షించారు. యువకుడు తలారి సూరి అక్కడి నుండి పారిపోయాడు. తరువాత బాలికతో పాటు వారి తల్లిదండ్రులు తుగ్గలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తుగ్గలి ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



    పాముకాటుతో జూనియర్ లైన్ మ్యాన్ మృతి 
    మరోవైపు ఇదే జిల్లాలో తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో జూనియర్ లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న 33 ఏళ్ల రమేష్ వారం రోజుల క్రితం స్వగ్రామమైన అమీనాబాద్‌లో ఇంటి పక్కన కట్టలు తీస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. అయితే పాము కాటు వేసిన విషయాన్ని గమనించని రమేష్ అపస్మారక స్థితికి వెళ్ళాడు. వెంటనే బంధువులు బాధితుడిని పత్తికొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈక్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు.

    ఇదీ చదవండి : బ్రహోత్సవాల కోసం సర్వం సిద్ధం.. ఉప్పుతో గోవిందుడి బొమ్మ గీసిన భక్తుడు.. చూస్తే వావ్ అనాల్సిందే

    కాలినడకన వెళుతున్న వారిని కబలించిన మృత్యువు
    మరోవైపు నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన దేవనకొండ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. దేవనకొండ మండలం కనకదిన్నె గ్రామానికి చెందిన గొల్ల నారాయణ, వెంకటలక్ష్మి దంపతులు కూలి పనులు చేస్తే జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు శివ(16) ఐటిఐ చదువుతున్నాడు.

    ఇదీ చదవండి: తాడేపల్లి ప్యాలెస్ కు టూలెట్ బోర్డు.. కౌంట్ డౌన్ మొదలైందన్న అచ్చెన్నాయుడు

    సోమవారం శివ అతని స్నేహితుడు నిరంజన్, మరో యువకుడు కలిసి కట్టెలు తెచ్చేందుకు పొలాల్లోకి వెళ్లారు. కట్టెలను ట్రాక్టర్లో వేసి.. కాలినడకన వస్తున్న వీరిని వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివ అక్కడికక్కడే మృతి చెందగా, నిరంజన్ కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు