Home /News /andhra-pradesh /

KURNOOL A WOMEN BRUTALLY MURDERED BY HER HUSBAND KNL NJ ABH

Kurnool News: భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త..! భార్యప్రవర్తన నచ్చలేదని గొడ్డలితో నరికి చంపిన భర్త..!

sudden attack on bussiness men and beaten him by thugs

sudden attack on bussiness men and beaten him by thugs

ఎదురెదుగా వస్తున్న లారీలు ఢీ.. భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్త..తండ్రి మందలించాడని 14ఏళ్ల పిల్లాడు ఆత్మహత్య.. స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..ఇలాంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తలను ఒకసారి చూద్దాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  T.Murali krishna, News 18, Kurnool


  భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్త..తండ్రి మందలించాడని 14ఏళ్ల పిల్లాడు ఆత్మహత్య.. స్నేహితుడిని కలిసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ఎదురెదుగా వస్తున్న లారీలు ఢీ.. ఇలాంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తలను ఒకసారి చూద్దాం. కట్టుకున్న వాడే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన మహానంది మండలంలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా(Prakasham) రాచర్ల(Racherla) మండలం సత్యవాలు గ్రామానికి చెందిన కాశీరావు గిద్దలూరు మండలం జయరామాపురం( jayaramapuram) గ్రామానికి చెందిన నాగం రమాదేవిలకు పెళ్లి అయి 20 ఏళ్లు అవుతుంది. బతుకుతెరువు కోసం 18 సంవత్సరాల క్రితం మహానంది మండలం గాజుల పల్లెకు వచ్చారు. కాశీ రావు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా… రమాదేవి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా భార్య ప్రవర్తన నచ్చక..ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.. గత కొన్ని రోజులుగా గొడవపడేవాళ్లు. ఈ నేపథ్యంలోనే గురువారం భార్యభర్తలిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో….కోపంతో భార్య రమాదేవిని కాశీరావు గొడ్డలితో నరికి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


  మంత్రాలయం - మాధవరం సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద బ్రేక్ ఫెయిల్ అయి ఒక లారీ మరో లారీని ఢీకొట్టింది. మాధవరం వైపు నుంచి రాయ్‌చూర్‌కు వెళ్తున్న లారీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు మధ్యలో వెళ్తుండగా…ఎదురుగా వస్తున్న లారీ బ్రెక్‌లు ఫెయిల్‌ కావడంతో ఈ లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో ఇటువైపుగా ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.


  అంగన్‌వాడి కేంద్రంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు..!
  అంగన్‌వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఉడిపడి చిన్నారికి గాయాలు పలగొండ పట్టణంలోని అంగన్వాడి కేంద్రంలో పై కప్పు పెచ్చు ఊడిపడి చిన్నారికీ తీవ్ర గాయాలయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులంతా మధ్యాహ్నం భోజనం చేసి గదిలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. సుమయ అనే చిన్నారిపై ఈ పెచ్చులు పడడంతో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. పై కప్పు శిథిలావస్థకు చేరిందని తల్లిదండ్రులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలా జరిగిందని మండిపడుతున్నారు.


  తండ్రి మందలించాడని..!

  తండ్రి మందలించాడని మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చౌటుకూరు గ్రామానికి చెందిన మద్దిలేటి లావణ్య దంపతుల రెండో కుమారుడు మురళీమోహన్ (14).. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్నేహితుడి మెమొరీ కార్డు తీసుకున్నాడని తండ్రి మందలించడంతో…. తీవ్ర మనస్థాపానికి గురైన పిల్లాడు…. ఈ నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


  Read this also; Vizag News: వైజాగ్ బీచ్‌కు ఏమైంది.. ఎందుకలా జరుగుతోంది..ముప్పు ముంచుకొస్తోందా..?


  బైక్ పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ..!

  నంద్యాల పట్టణంలోని గడివేముల నుంచి చెందిన సురేంద్ర నంద్యాలలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. సురేంద్ర సమీప బంధువైన చరణ్ నందికొట్కూరులోని డిగ్రీకాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే వీరిద్దరూ కలిసి తమ స్నేహితుడిని కలిసేందుకు గడివేముల నుంచి బైక్ పై వచ్చి.. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పోల్లూరు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా. గాయపడిన చరణ్‌ నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు