Home /News /andhra-pradesh /

KURNOOL A SPECIAL STORY ABOUT MOHARRAM FESTIVAL ABH BRV KNL

Kurnool: విషణ్ణ వదనంతో వీరులకు వందనం అర్పిస్తున్న ముస్లింలు: మొహర్రం యొక్క ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా?

మొహర్రం

మొహర్రం వేడుకలోని పీర్లు

మొహరం ఉత్సవం లేదా పీర్ల పండగ. ఈ పీర్ల పండగ ఇప్పుడు అందరి పండుగ. ఇస్లాం క్యాలెండర్‌లోని మొహర్రం నెల మొదటి రోజు నుండి పది రోజులపాటు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India
  (T.Murali Krishna, News 18, Kurnool)

  మొహరం ఉత్సవం లేదా పీర్ల పండగ. ఈ పీర్ల పండగ ఇప్పుడు అందరి పండుగ. ఇస్లాం క్యాలెండర్‌లోని మొహర్రం నెల మొదటి రోజు నుండి పది రోజులపాటు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఈ మొహర్రం వేడుకలలో పాల్గొంటారు. రాయలసీమలోని గ్రామీణ ప్రాంతాలలో పీర్ల పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గ్రామ ప్రజలంతా కలిసి ఈ పండుగలో చేసే అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలుగులో అనేక మొహరం గీతికలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ పీర్ల పండగ జాతీయ సమైక్యతకు తోడ్పడుతోందని మిస్సంకోచంగా చెప్పవచ్చు.

  అసలు మొహరం అనగానేమి:
  మొహరం ఇస్లాం సంవత్సరపు మొదటి మాసం పేరు యధార్థ రూపంలో నిషేధించబడినది మరియు మూర్ఖపు పట్టుదల అని అర్థాలు కలవు. తర్వాతి కాలంలో శోకం దుఃఖం అని అర్థాలతో స్థిరపడింది. ఏది ఏమైనాప్పటికీ మొహరంలో ఇతర పండుగల్లా దాతు అర్ధంలో కాకుండా సాధారణ అర్థంలోనే ఉపయోగించారు. హిజరీ శకం ప్రారంభమైనప్పటి నుండి మొహరం వాడుకలో ఉంది. అయితే మొహరం ఉత్సవానికి కారణమైన కర్బలా యుద్ధం క్రీస్తుశకం 680లో జరిగింది. మొహరం నెలలోనే కర్బలా యుద్ధం జరిగి మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ అతని పరివారం మొత్తం 72 మంది హతులయ్యారు. వీర మరణం చెందిన 72 మంది సంస్మరణార్థం పాటింపబడు సోకవ్యాంజాకా కార్యక్రమమే మొహర్రం. వాడుక భాషలో పంజాబ్ ఈద్, అసుర పీర్ల పండుగ మొదలైన పేర్లతో వ్యవహరిస్తున్నారు. అయితే ముస్లిమ్స్ వాడుక భాషలో వాడే ఈద్ పండుగలు సంతోషాలతో జరుపుకునేవి అని అర్థం. కానీ మొహర్రం సందర్భంలో మాత్రం వీటికి ఈ అర్థాలు తీసుకురాదు. ఎందుకంటే వీరుల మరణం, యుద్ధ బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ సోకించే కార్యక్రమం ఇది.

  మొహర్రం మొదట అరేబియా దేశంలోనే ప్రారంభమైంది. హుస్సేన్ పరివారాన్ని అంతమొందించిన సంవత్సరం తర్వాత "యోజిద్ కర్బలా "యుద్ధంలో హుస్సేన్ వర్గం వాడిన గుర్తులను వస్తువులను బషీర్ చేత ఇచ్చి పంపించాడు. మదీనా ప్రజలు వీటిని చూసిన తర్వాత ఆగ్రహవేశంతో మూజిద్ వర్గానికి వ్యతిరేకంగా వీధుల వెంబడి ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఇటువంటి ప్రదర్శనలను ఖలీఫాలు అనగదొక్కారు. మొహర్రం నిరసనను నిషేధించి పాల్గొన్న వారికి శిక్షించ సాగారు. అప్పటికే ముస్లింలలో షియా సున్ని తెగలు ఏర్పడి ఉన్నాయి. చాలా కాలం పాటు ఇటువంటి ప్రదర్శనలను ఖలీఫాలు అనగదొక్కారు. మొహరం నిరసనను నిషేధించి పాల్గొన్న వారిని శిక్షించ సాగారు చాలా కాలం సున్నీలతో కలిసి ఉన్న షియాలు దూరం కాసాగారు. దీనికి గల ముఖ్య కారణం మహమ్మద్ ప్రవక్త అతని పరివారాన్ని పూజించడం కొలవడం మొదలైన వాటిని తమ మతంలో అంతర్భాగంగా షియా వర్గీయులు భావించడమే.
  దీనిని సున్నిలు సమర్ధించలేదు.

  క్రీస్తు శకం 119 నుండి మొహర్రం నిరసన ప్రదర్శనలను బహిరంగంగానే ప్రదర్శించడం ప్రారంభమై ప్రతి సంవత్సరం నీరాటంకంగా కొనసాగుతోంది. ఆనాటి కర్బలా యుద్ధ భూమి నేడు ముస్లింలకు ముఖ్యంగా షియాలకు పవిత్రమైన యాత్ర స్థలంగా మారింది. హుస్సేన్ హత్యా చరిత్రను అనేక ప్రాంతాలలో ఆరుబయట నిర్మితమైన వేదికల మీద దృశ్యరూపంగా ప్రదర్శించేవారు. నాటి వేదికలు ప్రదర్శనలే నేటి పీర్ల కొలువులకు ఊరేగింపులకు బీజాలు. ప్రారంభంలో "షియాలు" హుస్సేన్ సానుభూతిపరు ఒక పద్ధతిగా శోకాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇరాన్ లో అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. ఇతర పండుగల వలె మొహర్రంను పాటించడంలో ఖచ్చితమైన నియమాలు ఏవి లేని కారణంగా ఒక దేశానికి ఇంకొక దేశానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో మొహర్రం ఎప్పటి నుండి ప్రారంభమైందో కచ్చితంగా తెలియనిప్పటికీ రాజలాంఛనాలతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించింది మాత్రం తైమురుగా చెప్పవచ్చు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, Devotional, Kurnool, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు