(T. Murali Krishna, News18, Kurnool)
హోటల్లో దొరికే ఫుడ్డుకు అలవాటు పడి ఎక్కువగా హోటల్లో తింటున్నారా. అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. సాధారణంగా హోటల్స్ లో చాలావరకు ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచి కస్టమర్స్ అడిగిన వెంటనే వాటిని వేడి చేసి ఇస్తుంటారు. ఇలా చేసే క్రమంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహార పదార్థాలు కాస్త పాచిపోవడం దుర్వాసన రావడం జరుగుతుంది. అలాంటి సమయంలోకొంతమంది హోటల్ నిర్వాహకులు వాటిని కప్పిపుచ్చే విధంగా వాటిని మళ్ళీ వేడి చేసి కస్టమర్లకు అందిస్తుంటారు. అలా తిన్నవారికి అనేకమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అచ్చం ఇలాంటి ఉదాంతమేఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జరిగింది.
ఓ కుటుంబ సభ్యులు టిఫిన్ తినడానికి నంద్యాల పట్టణంలోని హోటల్ టూరిస్ట్ రెస్టారెంట్‌కి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులకు గట్టి షాక్ తగిలింది.పెళ్లి జరిగి రెండు రోజుల అనంతరం కుటుంబ సభ్యులంతా ఆ హోటల్ కి వెళ్లి భోజనం చేసే సమయంలో.పెళ్లి కొడుకు ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేయగా ఆ ఇడ్లీ సాంబార్ తింటున్నా సమయంలో ప్లేట్లో బల్లి ప్రత్యక్షమైంది. అది చూసిన పెళ్ళికొడుకు ఒక్కసారిగా షాకు గురయ్యాడు. దీంతో ఇదేమిటని హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా. వారు దాన్ని తేలికగా తీసుకొని ఏమి కాదులే చిన్న బల్లె కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హోటల్ యజమాన్యంతో గొడవకు దిగారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషయం పోలీసులకు తెలియడంతో నంద్యాల పట్టణం టూ టౌన్ పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని. బల్లి పడిన పాత్రలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బంధువులు ఘటనకు కారకులైన వారిని హోటల్ యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో హోటల్లో ఉన్న కస్టమర్స్ అంతా ఒక్కసారిగా కంగు తిన్నారు.టూరిస్ట్ హోటల్ యాజమాన్యం తీరును నిరసిస్తూ పెళ్లి బృందం...తిరుగు ప్రయాణం అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News