హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ఎమ్మెల్యే ఇంటి పక్కనే భారీ చోరీ..! మొత్తం ఊడ్చేసిన దొంగలు

Kurnool: ఎమ్మెల్యే ఇంటి పక్కనే భారీ చోరీ..! మొత్తం ఊడ్చేసిన దొంగలు

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ దోపిడీ

కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ దోపిడీ

కర్నూలు జిల్లా (Kurnool District) లో ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఆదోనిలో జరుగుతున్న చోరీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఎస్.కే.డీ కాలనీలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఇంటి పక్కనే చోరీ జరిగింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Adoni, India

  Murali Krishna, News18, Kurnool

  కర్నూలు జిల్లా (Kurnool District) లో ఇటీవల వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఆదోనిలో జరుగుతున్న చోరీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఎస్.కే.డీ కాలనీలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఇంటి పక్కనే చోరీ జరిగింది. బంగారు వ్యాపారి ఖలీల్‌ ఇంటికి దొంగలు కన్నం వేశారు. ఈ నెల 28వ తేదీన రాత్రి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అనంతరం ఈ నెల 29వ తేదీన రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరుచుకొని ఉండడంతో కంగారుపడ్డారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉంచిన దాదాపు 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.3 లక్షలు విలువ చేసే వజ్రాల నెక్లెస్‌ చోరీకి గురైనట్లు బాధితులు ఆదోని రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

  విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌, ఒకటో పట్టణ సీఐ విక్రమసింహా, ఎస్సై హనుమంతరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. గడిచిన రెండు నెలలలో వరుసగా 12 దొంగతనాలు జరగడం ఆదోని పట్టణ వాసులను తీవ్ర భయందోళనకు గురించేస్తుంది. ఆదోని పట్టణంలో వరుస దొంగతనాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారనేది ఈ ఘటనలు చూస్తే అర్థం అవుతోందని ప్రజలు తీవ్ర అసహన వ్యక్తం చేస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీ భూముల రీసర్వేలో అవినీతి మాయ.. కొలతల మాటన చేతివాటం.. అసలు స్టోరీ ఇదే..!

  గత నెలలో బంగారు బజారులోని జబ్బార్‌ జువెల్లర్స్ ‌లో భారీ చోరీ జరిగింది. దాన్ని పోలీసులు 24 గంటల్లోనే చెదించినప్పటికి అది మరువకముందే వారం పది రోజుల వ్యవధిలో ఒకే కాలనిలో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనలు జరిగాయి. మరో వైపు జిల్లా ఎస్పీ సిధార్థ్ కౌశల్ మాత్రం కర్నూలులో జరిగే దొంగ తనాలను త్వరగా చెదిస్తున్నారు. అదే పనితీరుతో ఆదోనిపై కూడా దృష్టి సారించి ప్రజలకు రక్షణ కల్పించాలంటూ ప్రజలు కోరుతున్నారు.

  ఇది చదవండి: మున్సిపల్‌ ఆఫీసులో గాడిదలు.. వాటికి అక్కడేం పని..? అసలు మేటర్ ఏంటంటే..!

  కల్వర్టును ఢీకొన్న ఆర్టీసి బస్సు..!

  కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్ళారి నుంచి కర్నూలు వెలుతున్న ఎమ్మిగనూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు తృటిలో ప్రాణాపాయం తప్పింది. కానీ కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గురైన బస్సు ఎడమభాగం నుజ్జు నుజ్జుగా అయింది. అయితే బస్సు స్టీరింగ్ విరిగిపోవడమే ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Gold robbery, Kurnool, Local News

  ఉత్తమ కథలు