Home /News /andhra-pradesh /

KURNOOL A PERSON HARASSED BY THE LOAN APP IN KURNOOL KNL NJ ABH

Kurnool: అడగకుండానే మీ ఎకౌంట్‌లో డబ్బులు వేస్తారు..! డబుల్‌ ఎమౌంట్‌ కట్టమంటూ వేధిస్తారు..!

ఇటీవల

ఇటీవల కాలంలో లోన్‌యాప్ వేధింపుల కేసులు రోజుకు పెరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు లోన్‌ వేధింపులతో బలైన బాధితుల సంఖ్య వందల్లోనే ఉంటుంది. తాజాగా ఇలాంటి లోన్‌యాప్ వేధింపులు తాళలేక… కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరుకి చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఇటీవల కాలంలో లోన్‌యాప్ వేధింపుల కేసులు రోజుకు పెరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు లోన్‌ వేధింపులతో బలైన బాధితుల సంఖ్య వందల్లోనే ఉంటుంది. తాజాగా ఇలాంటి లోన్‌యాప్ వేధింపులు తాళలేక… కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరుకి చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    ( T.Murali Krishna, News 18, Kurnool)

    ఇటీవల కాలంలో లోన్‌యాప్ వేధింపుల కేసులు రోజుకు పెరుగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు లోన్‌ వేధింపులతో బలైన బాధితుల సంఖ్య వందల్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన ప్రమేయం లేకున్నా… ఎవరో తన నెంబర్ ఇచ్చారంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా రికవరి ఏజెంట్‌లు టార్చర్‌ చేసిన సంగతి రాష్ట్రమంతా తెలిసిందే. ఇలా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులకు కూడా ఈ లోన్‌యాప్‌ వేధింపులు తప్పడం లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..

    తాజాగా ఇలాంటి లోన్‌యాప్ వేధింపులు తాళలేక… కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరుకి చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని లోన్‌యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ రుణాలిస్తూ… ఇచ్చిన దానికి వడ్డీలంటూ అసలు కంటే ఎక్కువగా వసూలు చేస్తూ వేధిస్తుంటారు.

    ఎమ్మిగనూరు పట్టణంలోని టీబీటీ కాలనీకి చెందిన డి శ్యామ్ కుమార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. సెల్‌ఫోన్‌లో వెల్ క్రెడిట్ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. అందులో రుణ సదుపాయం ఉన్నట్లు గుర్తించి గత జూలై 19న లింక్‌ను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత మీ క్రెడిట్‌ స్కోరు చాలా బాగుంది అంటూ..మీకు తప్పకుండా లోన్‌ఇస్తామంటూ కాల్‌ చేసి మరి చెప్పారు. అవసరానికి డబ్బులు వస్తాయనుకుని శ్యామ్‌కుమార్‌ భావించాడు. వాళ్లు చెప్పినట్లుగానే శ్యామ్ ప్రసాద్‌ ఎస్‌బీఐ ఎకౌంట్‌కు యాప్ ద్వారా రూ.9,000 జమ చేశారు.

    డబ్బులొచ్చిన రెండు రోజులకే..!

    శ్యామ్‌ కుమార్‌ ఎకౌంట్‌లో డబ్బు జమ అయిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు చెల్లించాలంటూ 977981 2186086, 9435302278 నెంబర్ల ద్వారా వాట్సప్‌మెసేజ్‌లు , కాల్స్‌ రావటంతో తీసుకున్న రూ.9 వేలకు గాను రూ.16,270 లింక్ ద్వారా చెల్లించాడు.

    అడగకుండా డబ్బులిచ్చి...!

    ఇక అంతా అయిపోయిందనుకున్న శ్యామ్‌ కుమార్‌కు మళ్లీ జులై 25న తన మొబైల్‌కు వచ్చిన మెసెజ్‌ చూసి షాకయ్యాడు. తన అకౌంట్లో రూ.14,000 జమ అయ్యాయి. తను ఎవ్వరిని అడగలేదు, ఏ యాప్‌లోనూ రిక్వెస్ట్ పెట్టలేదుద..ఈ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయా అని ఆలోచించుకుంటూ ఉండగానే.. రెండు రోజులకు మళ్లీ ఓ ఫోన్‌కాల్ వచ్చింది. అప్పు రూ.25,623 చెల్లించాలని.. లేకపోతే నీ అంతు చూస్తామంటూ బెదిరించాడు. దీంతో భయపడి శ్యామ్‌కుమార్‌ రూ.25,623 చెల్లించాడు.

    ఇంక వెంటనే ఆ వెల్ క్రెడిట్ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. మళ్లీ ఈ నెల 1న మళ్లీ శ్యామ్‌కుమార్‌ బ్యాంక్ అకౌంట్‌కు రూ. 16,000 జమచేసి… తీసుకున్న అప్పును ఈ నెల 8వ తేదీలోపు రూ. 29.283 చెల్లించాలని వాట్సప్‌ మెసెజ్‌ రావడంతో భయపడి పోలీసులను ఆశ్ర యించాడు.

    ఇంత వరకు వారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో కూడా తెలియదని చెప్పాడు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టి వారి వేధింపుల నుండి కాపాడాలని కోరుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Local News, Visakhapatnam, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు