Home /News /andhra-pradesh /

KURNOOL A MENTALLY DISOBEDIENCE WOMAN CHANGED AS GODDESS IN KURNOOL ANDHRA PRADESH NGS KNL NJ

Temple: పిచ్చిది అంటూ ఎగతాళి చేశారు.. ఇప్పుడు గుడి కట్టి పూజిస్తున్నారు? అసలేమైంది?

ముందు

ముందు పిచ్చిది అన్నారు. ఇప్పుడు గుడి కట్టారు..

Temple: ఒకప్పుడు ఆమెకు పిచ్చి పట్టింది అంటూ అందరూ ఎగతాళి చేశారు. ఆమె దైవత్వం బయటపడిన తర్వాత అందరూ చేతులెత్తి దండం పెట్టారు. ఇప్పుడు ఆమెకు ఏకం గుడి కట్టేశారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆలయం ఎక్కడుందంటే!

  Murali Krishna, News18, Kurnool

  Temple: కొన్ని సంఘటనలు ఎలా జరుగుతుతాయో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే ఒకప్పుడు పిచ్చిది అంటూ.. ఆ ఊరి జనం అంతా ఆమెను ఎగతాళి చేశారు.. కానీ ఇప్పుడు ఏకం గుడి కట్టి పూజిస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే.. శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు కర్నూలు జిల్లా (Kurnool District) లోని  ఆదోని (Adoni)కి 7 కిలోమీటర్ల దూరంలో గల మూసానిపల్లె గ్రామం (Moosanipalle village)లో ఉండేవారు. ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరిస్తూ ఉండేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిదని అందరూ భావించేవారు. ఆమె నిజ తత్త్వాన్ని తెలుసుకోలేని ఆమె కుటుంబసభ్యులు, గ్రామ ప్రజలు పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుందని భావించి మారెప్ప అనే యువకునికిచ్చిపెళ్ళిజరిపించారు. కానీ పెళ్ళి రోజు రాత్రే ఆమె యథా ప్రకారంగా దిగంబరంగా తిరిగివచ్చి పుట్టింటికి చేరింది.

  ఆమెకు తొట్టి లక్ష్మమ్మ పేరు ఎలా వచ్చింది?
  ఆమెను పిచ్చిదానినిగా భావించి రాళ్ళతో కొట్టి హింసించే వారు కొందరు ఊరి జనం. ఆమె నొటినుంచి వెలువడిన వాక్కులే శాపాలుగా తగిలి నశించి పోయారు. ఆమె వాక్శుద్ధి అలాంటింది అని లేటుగా తెలుసుకున్నారు.  ఆదోనిలోజరిగే సంతకు వస్తున్న వారితో కలిసి తన 15వ ఏట ఆమె ఆదోని చేరింది. దిగంబరంగా తిరుగుతూ, దొరికింది తింటూ ఆమె కసువు తొట్టి పక్క స్థిరంగా ఉండిపోయింది. అప్పటినుంచీ ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనే పేరు స్థిరపడింది.

  ఇదీ చదవండి : కేటీఆర్ ను జగన్ అంత మాట అన్నారా? ఆ వ్యాఖ్యల తరువాత ఒకే వేదికపై ఇలా.. ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ

  ఆమె చూపిన మహిమలు కోకొల్లలు                                                         లక్ష్మమ్మ తన వాక్శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు క్యాన్సర్  వ్యాధి నయం చేసిందని స్థానికులు చెబుతున్నారు. లక్ష్మమ్మకు ఓ మహిళ ఒక్క అణా సమర్పించుకోగా.. అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామినిగా చేసిందంటారు. మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకొన్నది ఎంత స్వల్ప మొత్తమైనా అది అనేక రెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనమంటారు స్థానికులు. అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాళ్ళు సంతానవతులయ్యారు. ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యలద్వారా సూచించిన త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ అని గుర్తింపు పొందారు.

  ఇదీ చదవండి : పవన్ ను సీఎం చేయడమే టార్గెట్.. మెగా ఫ్యాన్స్ కీలక భేటీ వెనుకు ఉన్నది ఎవరు..?

  ఖండయోగాన్ని ప్రదర్శించిన లక్ష్మమ్మ                                                కుండపోతగా వర్షం కురిసిన తరువాత పొంగిపొర్లుతున్న కాలువలో ఆమె మరణించి ఉంటుందని గ్రామస్థులు భావించి, చింతింస్తున్న సమయంలో, లక్ష్మమ్మవ్వవారు చెక్కుచెదరకుండా క్షేమంగా బయటికి వచ్చి తన మహిమతో అందరిని ఆశ్చర్యపరిచారు. శరీరాన్ని ముక్కలుగా చేసి ఏమీ తెలియయనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండయోగాన్ని కూడా ఆమె చూపించారంటున్నారు పూర్వీకులు.  ఆమె నిజమహిమ తెలుసుకొన్న స్వర్గీయులు రాచోటి వీరన్న, తుంబళం గుత్తిలక్ష్మయ్య , బల్లేకల్లు నరసప్పగారు, మన్నే రాంసింగ్ మొదలైన వారెందరో ఆమెను పూజించి సిరిసంపదలు పొందినట్టు కథలు చెబుతారు.

  ఇదీ చదవండి : నవ వధువు మృతి కేసులో వీడిన మిస్టరీ.. విచారణలో సంచలన విషయాలు

  జీవ సమాధిలో వెళ్లిన లక్ష్మమ్మ                                                                స్వర్గీయ రాచోటి రామయ్య ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించారు. లెక్కకు మిక్కిలిగా మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయొగి లక్ష్మమ్మవారు 16-05-1933 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించారు. అప్పటినుంచీ అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపుతారు. ఆమె జీవసమాధి అయిన ప్రాంతంలో స్థానిక గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించారు. ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ రాచోటి రామయ్య ఆధ్వర్యంలో అవ్వకు వెండిరథము, దేవాలయానికి వెండిరేకుల తాపడము, అవ్వ విగ్రహానికి బంగారు కవచము, అనేక బంగారు ఆభరణాలు మొదలైన దివ్యమైన నూతన శోభలు చేకూరాయి.

  ఇదీ చదవండి : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు..! క్లారిటీ ఇచ్చిన మంత్రులు

  పక్క రాష్ట్రాల నుంచి వస్తోన్న భక్తులు
  శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లె, అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడి నిత్యపూజలు జరుపబడుతున్నాయి. అవ్వమందిరము దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని అనేక ప్రాంతాల నుంచీ భక్తులు అవ్వను దర్శించుకోడానికి వస్తున్నారు. ఆదోని చుట్టుపక్కల తదితర గ్రామాల ప్రజలు ఆమెను ఇలవేల్పుగా కొలుస్తారు. ప్రతీ ఏటా జాతరలు నిర్వహిస్తారు. ఆమెకు పలుచోట్లా చిన్న చిన్న ఆలయాలు కూడా నిర్మించారు. కొలిచిన వారికి కొంగుబంగారము, నమ్మిన వారికి నమ్మినంత వరాలనిచ్చే అమృత స్వరూపిణి భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వవారు. కొంతమంది ఆమె పేరు మీద బ్యాంకులు, స్కూల్స్ కాలేజీలు లక్ష్మమ్మ సర్వీస్ అనే పేరుమీద బస్సులు కూడా నడపడం విశేషం.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు