Murali Krishna, News18, Kurnool
మనిషి ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్ లో ఎన్నో టెన్సన్స్ రక రకలైన మానసిక ఒత్తిడికి గురై ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎక్కువ శాతం వైద్యులు కూడా సూచించేది మ్యూజిక్ థెరపీ పాటలనేవి మనిషి మానసిక ప్రశాంతతకు కొంతమేర తోడ్పాడుతుంది. అలాంటి సంగీతంలోని ఒకటైనది పిల్లన్న గ్రోవి. శ్రీ కృష్ణుడు సైతం గోకులంలో పిల్లన్న గ్రోవితో అందరిని అక్కటుకునే వాడు అని పురాణలో ఉంది. అలాంటి పిల్లన గ్రోవి కనుమరుగవుతున్న రోజ్జులో మళ్ళీ హస్త కళకు ప్రాణంపొసేలా వాటిని తయారు చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) నందికొట్కూరు పట్టణనికి చెందిన చిలక మల్లికార్జున. సంగీతంపై మల్లిఖార్జునకు చిన్ననాటి నుంచే మక్కువ.. నేర్పించే వాళ్ళు లేక బయట మార్కెట్లో దొరికే పిల్లన గ్రోవి నాణ్యత సర్రిగా లేకపోవడం వాటిని ఆయనే తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అప్పటి నుంచి ఆయనే స్వయంగా వాటిని ఒక ప్లాస్టిక్ పైపుల ద్వారా తయారు చేయడం మొదలుపెట్టారు. వాటినుంచి వచ్చే సంగీతం ఆయనను సంతృప్తి పరచలేదు. అతటితో ఆగకుండాతానే స్వయంగా అసోం నుంచి నాణ్యమైన బొంగులను తెప్పించుకొని వాటిని ఇంట్లో తానే స్వయంగా చేతితో తయారు చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఆయన చేసే పిల్లనగ్రోవికి వెన్నెల ఫ్రూట్స్ అనే ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు చిలక మల్లికార్జున.
ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఈ పిల్లనగ్రోవి తయారీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా వాటిని దేశ విదేశాలకు పంపడం మొదలుపెట్టాడు. రూ.800 నుంచి రూ.10వేల వరకు విలువచేసే పిల్లన్న గ్రోవిలు తయారు చేయడం విశేషం. ఎవరైనా సరే ఆర్డర్ చేస్తే ఒక వారం లోపల వాటిని తయారు చేసి వినియోగదారులకు అందిస్తుంటాడు. ఈయన చేసే పిల్లనగ్రోవికి అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశ విదేశాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయంటే మల్లికార్జున కళకు ఎంత ఖ్యాతి ఉందో అర్ధమవుతుంది.
వివరాలు: చిలకా మల్లికార్జున, సెల్ :80740320661, నందికొట్కూరు మండలం, నంద్యాల జిల్లా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News