హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అర్గానిక్ ఫార్మింగ్‌లో కొత్తపుంతలు..! ఔరా అనిపిస్తోన్న ప్రకృతి వ్యవసాయసాదురుడు..!

అర్గానిక్ ఫార్మింగ్‌లో కొత్తపుంతలు..! ఔరా అనిపిస్తోన్న ప్రకృతి వ్యవసాయసాదురుడు..!

సేంద్రియ

సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్న కర్నూలు రైతు

సేంద్రియ వ్యవసాయం భారతదేశ రైతులకు కొత్త కాదు. కాకపోతే మధ్యలో రసాయనాల వాడకాలు పెరిగి చాలామంది మర్చిపోయారు..కానీ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం వైపు ప్రపంచం అడుగులేస్తోంది..

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  సేంద్రియ వ్యవసాయం భారతదేశ రైతులకు (Indian Farmers) కొత్త కాదు. అనేక వేల సంవత్సరాల నుండి సేంద్రియ పదార్థాలను భూమికి అందించి ఆరోగ్యమైన, నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారు. కాల క్రమేణ దేశ జనాభా పెరగడం, వారికి తగ్గ ఆహార ఉత్పత్తి కొరకు అధిక దిగుబడి వంగడాలను ప్రవేశ పెట్టడం, రసాయనిక ఎరువుల వాడకం.., ఇలాంటి వాటి వల్ల ప్రజలకు అనారోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యం లాంటి ఎన్నోసమస్యలు మానవాళిని చుట్టుముట్టాయి. దాని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రపంచం దేశాలు సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతను గుర్తించి.., మళ్లీ సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుడుతున్నారు. సహజ వనరులైన పోషకాలు, సహజ సస్య రక్షణ పద్ధతులు ఉపయోగించి సక్రమ యాజమాన్య పద్ధతులలో పంటలను పండించే విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు.

  ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో గల హుస్నాపురం గ్రామానికి చెందిన రైతు సూర్యనారాయణ గత ఆరు సంవత్సరాలుగా తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు అదనంగా 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలను సాగుచేస్తున్నాడు.

  ఇది చదవండి: ఈ యుద్ధకళ నేర్చుకుంటే.. ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యం..! మీరు ట్రై చేయండి..!

  వాటికి కావాల్సిన ఎరువులను మందులను పాత పద్దతిలో అదే సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్నాడు. అంతే కాకుండా సేంద్రియ పద్దతిలో పంటలను పండించి అధిక దిగుబడి సాధించే విధంగా ఇతరులకు అవగాహన కలిపిస్తున్నాడు. సేంద్రియ పద్దతిలో తయారు చేసే మందులనే కాదు.., పొలాల్లో పనిచేసే కూలీలకు సులువుగా కలుపు తీసుకునేందుకు వీలుగా గుంటికలు కూడా తయారు చేశాడు.

  ఇది చదవండి: విశాఖలో రాజమండ్రివారి రోజ్ మిల్క్.. తాగితే అమృతమే..! అంత టేస్ట్ ఎలా వచ్చిందంటే..!

  ఇలా సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల సహజ వనరులు మనతో పాటు భవిష్యత్‌ తరాల వాళ్లకు కూడా అందుబాటులో ఉంటాయని సూర్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్ధతి వల్ల పంట నాణ్యత, ఉత్పత్తులు, నిల్వ గుణం పెరుగుతాయంటున్నారు.  అంతేకాకుండా ప్రజలకు సురక్షిత ఆహరం లభిస్తుంది. ఆహారం విషపూరితం అయ్యే అవకాశమే ఉండదు.

  ఇది చదవండి: పొన్నగంటి ఆకు.. పోషకాల గని..! ఈ ఆకుతో చేసే వడలు తింటే ఎన్నో హెల్త్‌ బెనిఫిట్స్‌..!

  సేంద్రీయ వ్యవసాయం కోసం అధిక పెట్టుబడులు పెట్టవలసిన అవసరం కూడా లేదు. పంట మార్పిడి, అంతర పంటల వల్ల చీడ పిడల ఉధృతి తగ్గి రైతు ఆర్ధికంగా బలపడతాడు. ఈ పద్ధతి ద్వారా రైతులకు పంట పండించేందుకు సులువైన మార్గం అంటున్నారు సూర్యనారాయణ. మనం ఆరోగ్యకరమైన పంటను పండించినప్పుడే ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను చూడగలుగుతామంటూ సూర్యనారాయణ అందరకీ చెబుతున్న మాట. చక్కగా ఉంది కదా..కుదిరితే మనం ఫాలో అవుదాం.. ఆరోగ్యంగా ఉందాం.

  అడ్రస్‌: హుస్నాపురం, ప్యాపిలి, ఉమ్మడి కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్‌- 518221.

  ఫోన్‌ నెంబర్‌ : 9701912779, సూర్యనారాయణ

  Kurnool Organic Farming Map

  ఎలా వెళ్లాలి: కర్నూలు నుంచి 80 కిలోమీటర్లు దూరం ప్యాపిలి ఉంటుంది. అక్కడ నుంచి 3 కిలో మీటర్లు దూరంలో హుస్నాపురం గ్రామం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News, Organic Farming

  ఉత్తమ కథలు