హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vinayaka Chavithi: ఖైరతాబాద్ కంటే ఎత్తైన గణపతి.. మట్టితో సిద్ధమైన మహా వినాయకుడు.. ఎక్కడంటే..!

Vinayaka Chavithi: ఖైరతాబాద్ కంటే ఎత్తైన గణపతి.. మట్టితో సిద్ధమైన మహా వినాయకుడు.. ఎక్కడంటే..!

కర్నూలులో

కర్నూలులో మహాగణపతి

ప్రజల్లో పర్యావరణ హితంపై అవగాహన పెరగడంతో ఈ ఏడాది చాలా చోట్ల మట్టిగణేషుని విగ్రహాలే కనిపిస్తున్నాయి. గణపతి ఉత్సవాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్‌ వినాయకుడు (Khairathabad Ganesh). అయితే ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణనాథుని విగ్రహాన్ని మించి మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మట్టిగణపతి విగ్రహాలు వెలుస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool


  దేశవ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాలు ఉపందుకున్నాయి. వాడవాడలా వినాయక చవితి సందడి మొదలైంది. ప్రజల్లో పర్యావరణ హితంపై అవగాహన పెరగడంతో ఈ ఏడాది చాలా చోట్ల మట్టిగణేషుని విగ్రహాలే కనిపిస్తున్నాయి. గణపతి ఉత్సవాలు అంటే ఠక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్‌ వినాయకుడు (Khairathabad Ganesh). అయితే ఈ ఏడాది ఖైరతాబాద్‌ గణనాథుని విగ్రహాన్ని మించి మన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మట్టిగణపతి విగ్రహాలు వెలుస్తున్నాయి. అందులోనూ విశాఖపట్నం (Visakhapatnam) లోని గాజువాకలో 80 అడుగుల భారీ మట్టిగణనాథుడు సిద్ధమైతే...కర్నూలు (Kurnool) లో 55 అడుగుల మహాగణనాథుడు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు స్వస్తి చెప్పి మట్టి గణపయ్యలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలో 55 అడుగుల పర్యావరణ హిత భారీ గణపయ్య పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు.


  కర్నూలు నగరం పాతబస్తిలోని తుంగభద్ర నది తీరానా 55 అడుగుల ఎత్తైన గణనాధుడు కొలువుతీరాడు. పవిత్ర తుంగభద్ర నది తీరాన రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వినాయక భక్త బృందం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మట్టి గణపతిని తయారు చేయడానికి సుమారు 30 లక్షలు వెచ్చించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా నుంచి వచ్చిన కార్మికులు ఈ విగ్రహానికి తయారు చేస్తునట్లు కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు.


  ఇది చదవండి: ఈతరం ఇంజనీర్లకు సవాల్ ఈ బిల్డింగ్.. వందేళ్లు దాటినా చెక్కు చెదర్లేదు..


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాకలోని 80 అడుగుల భారీ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తుండగా కర్నూలులో ఏర్పాటు చేస్తున్నటు 55 అడుగుల భారీ మట్టి గణపతి రాష్ట్రంలోని రెండో స్థానంలో నిలవనుంది. కోల్‌కతాకు చెందిన శిల్పిశక్తి దాస్ పర్యవేక్షణలో రెండు నెలలుగా 12 మంది కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బంకమట్టి, ఎర్రమట్టి, వెదురు బొంగులు, వరిగడ్డి, గోన సంచులు, సహజ రంగులతో ఈ భారీ గణనాథుడిని తయారు చేశారు.


  ఇది చదవండి: వీళ్ల ఇంగ్లిష్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అమెరికన్ యాక్సెంట్‌లో అదుర్స్..!


  వినాయకచవతి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి పూజలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు వైభవంగా జరపనున్నారు. మండపాన్ని కూడా కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. పూజకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేశారు. బారికేడ్లను పెట్టారు. చిన్న పిల్లల తల్లులు, వృద్ధులకు సైతం త్వరగా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లుచేశారు. 11 రోజుల పాటు ప్రతి రోజు వివిధ రకాల పూజలు నిర్వహించి..ఆఖరిరోజున అంటే సెప్టెంబర్ 10వ తేదీన నిమజ్జనం చేయనున్నారు.  విగ్రహం ఏర్పాటు చేసిన చోటే తుంగభద్ర నది జలంతో నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 2018వ సంవత్సరంలో 51 అడుగులు, 2019వ సంవత్సరంలో 65 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 55 అడుగుల మహారాజు రూపంలో ఉన్న ఎకో ఫ్రెండ్లీ వినాయకుని ఏర్పాటు చేసి పూజించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది అధికంగా మట్టిగణనాథుల విగ్రహాలే కనువిందు చేస్తున్నాయి.


  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News, Vinayaka chavathi

  ఉత్తమ కథలు