Murali Krishna, News18, Kurnool
పిల్లలు కళ్ళ ఎదుటే ఆడుతూ పాడుతూ తిరుగుతుంటే వాళ్ళ బూడిబుడి నడకలు, వచ్చి రాని మాటలు ఆ తల్లి తండ్రులకు కొన్ని వేల కోట్లు పెట్టిన రాని సంతోషం వారికీ కలుగుతుంది. కానీ అదే పిల్లలు కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోతే. ఆ తల్లి తండ్రుల బాధ వర్ణనతీతం. ఇలాంటి సంఘటనే కర్నూలు జిల్లా (Kurnool District) పెద్ద కడబురు మండలంలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 4ఏళ్ల బాలుడు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. అమ్మా తలనొ స్తోంది.. తాగేందుకు నీళ్లివ్వమ్మా! అని రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అంజి (4) అనే బాలుడు రోదిస్తున్న తీరు అక్కడి అందరిని కంటతడి పెట్టించింది. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృత్యు ఒడికి చేరాడు. ఈ సంఘటన పెద్దకడుబూరు మండలం బాపులదొడ్డి సమీ పంలో జరిగింది.
మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కోసిగి గ్రామానికి చెందిన రామాంజి, హనుమంతమ్మ దంపతులకు అంజి (4) ఒక్క గానొక్క కుమారుడు. ఆదివారం సెలవుదినం కావడంతో ఉదయం కోసిగి గ్రామం నుంచి పెద్దకడబూరు మండలం బాపులదొడ్డి గ్రామ సమీపంలోని పొలానికి ఆటోలో వెళ్లారు. ఆటో దిగి పొలంలోకి వెళ్తుండగా వేగంగా వస్తున్న మరో ఆటో బాలుడు అంజిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అంజిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదోని ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు కర్నూలుకు తరలించాలని సూచించారు. బాలుడిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు వర్ణనాతీతం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Road accident