హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: రేపు నంద్యాలకు సీఎం జగన్.. మరో ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం.. కానీ అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?

CM Jagan: రేపు నంద్యాలకు సీఎం జగన్.. మరో ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం.. కానీ అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. ఎందుకంటే?

నంద్యాలకు సీఎం జగన్

నంద్యాలకు సీఎం జగన్

Kurnool: రేపు సీఎం జగన్ కర్నూలు వెళ్తున్నారు. అక్కడ కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో నిర్మితమవుతున్న రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ ప్రారంభించనున్నారు. కానీ అధికారులు మాత్రం టెన్షన్ పడుతున్నారు..? కారణం ఏంటో తెలుసా?

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) రేపు ఉమ్మడి ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) పర్యటనకు వెళ్లనున్నారు.  ఇవాళ బ్రహ్మొత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం.. రేపు నంద్యాల జిల్లాలో రామ్‌కో సిమెంట్స్‌ (Ramco Cements) ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ (Gannavaram Airport) నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 5.20 గంటలకు తిరుపతి (Tirupati) గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రేపు 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌  (Renugunta Airport) నుంచి ఓర్వకల్‌ బయలుదేరుతారు. 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల చేరుకుని రామ్‌కో సిమెంట్స్‌ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

  అయితే కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో నిర్మితమవుతున్న రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ (Ramco Cement Industry) ప్రారంభానికి ముందే వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ మధ్యకాలంలోనే పరిశ్రమ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో పరిశ్రమ అధికారులకు, రైతుల కుటుంబాల పిల్లలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

  పరిశ్రమ ఏర్పాటుకు ముందు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలలోని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత మొండి చేయి చూపిస్తున్నారు అంటూ యువకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులకు సర్దు చెప్పి గొడవను సర్దుమనిగేలా చేశారు.

  ఇదీ చదవండి : ఆదాయం పెరగాలంటే ఈ రోజు అమ్మవారిని దర్శించుకోండి.. బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం

  ఈ క్రమంలో ఆదివారం పరిశ్రమలో కన్వేయర్ బెల్ట్ స్ట్రక్చర్ పనులు చేస్తుండగా. ఒక్కసారిగా స్ట్రక్చర్ కుప్పకూలి కింద పడిపోయింది. దీంతో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం మల్తా జిల్లా రూట్‌ బసంత మండలానికి చెందిన అబ్దుల్‌ రహీం (24), మేదినిపూర్‌ జిల్లా తెనతుల్‌ బిర్యా గ్రామానికి చెందిన సుమాన కుమార్‌ ప్రధాన (21) జారి పడి అక్కడికక్కడే మృతి చెందారు.

  ఇదీ చదవండి : ఒక్కసారి డబ్బు డిపాజిట్‌ చేస్తే.. ఆరు నెలల్లో రెండింతలు..! అసలు విషయం ఏంటంటే..?

  విషయం బయటికి తెలియడంతో ప్రజా సంఘాల నాయకులు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే గాయపడిన కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.

  ఇదీ చదవండి : కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

  ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో కూలీలకు పని భారం పెరిగి యాజమాన్యం నుంచి ఒత్తిళ్ల వల్ల ఇటువంటి ఘటన చోటు చేసుకుందని విమర్శలు వస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ముగ్గురు కార్మికుల మృతికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని కార్మిక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

  ఇదీ చదవండి : ఆస్ట్రేలియా టూ కాకినాడ ..! విద్యార్థులను వెతుక్కుంటూ ఖండాంతరాలు దాటొచ్చిన టీచరమ్మ..! ఎందుకో తెలుసా?

  రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కానుంది. ఈ సమయంలో ఇలాంటి ఘటన జరగడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఇతర కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు.

  ఇదీ చదవండి : ఆ పుణ్యక్షేత్రంలో దసరా, కార్తీకమాసం ఏర్పాట్లకు ఇంత ఖర్చా..! ఏం చేస్తారంటే?

  అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొలిమిగుండ్ల ఎస్‌ఐ రమేష్‌ రెడ్డి, కోవెలకుంట్ల సీఐ నారాయణ రెడ్డి, ఆళ్లగడ్డ డి.ఎస్.పి వెంకటరామయ్య, నంద్యాల ఆర్డీఓ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై రాంకో పరిశ్రమ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kurnool, Local News

  ఉత్తమ కథలు