హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం

Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం

జూహ్నవి (File Photo - image credit - twitter - @Telugu360)

జూహ్నవి (File Photo - image credit - twitter - @Telugu360)

సముద్రాలు దాటి.. విదేశాల్లో కెరీర్ డెవలప్ చేసుకుంటున్న మన తెలుగు వారికి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. ఆ యువతి మరణం అత్యంత విషాదకరం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Seattle : అమెరికా... సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి 23 ఏళ్ల జాహ్నవీ కందుల (Jaahnavi Kandula) దుర్మరణం చెందింది. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. సియాటిల్ పోలీస్ పెట్రోల్ వాహనం కింద చిక్కుకొని ఆమె చనిపోయినట్లు తెలిసింది. జహ్నవీది కర్నూలులోని ఆధోని అని తెలిసింది. అసలు ఆమె ఎలా చనిపోయింది? పోలీస్ పెట్రోల్ వాహనం కింద ఎలా చిక్కుకుంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

అమెరికాలో తెలుగు వారు, భారతీయులూ తరచూ చనిపోతూనే ఉన్నారు. గన్ కల్చర్, రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. సముద్రాలు దాటి.. విదేశాల్లో కెరీర్ డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంతో మంది భారతీయులకు ఇలాంటి రకరకాల కష్టాలు వస్తున్నాయి. ఇలాంటి మరణాలతో.. ఇండియాలో ఉండే తమ వారు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఆ లోటు ఎవరూ తీర్చలేనిది.

First published:

Tags: America, USA