హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ జిల్లాలో రోడ్డెక్కితే కేసే.. ఒక్కనెలలో ఏకంగా 10వేల కేసులు

ఆ జిల్లాలో రోడ్డెక్కితే కేసే.. ఒక్కనెలలో ఏకంగా 10వేల కేసులు

ఒకే నెలలో పదివేలకు పైగా కేసులు నమోదు ఎందుకో తెలుసా...

ఒకే నెలలో పదివేలకు పైగా కేసులు నమోదు ఎందుకో తెలుసా...

ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) బ్రేక్ చేసిన వారికి మాత్రం పనిష్మింట్ తప్పదు. స్పాట్ లో జరిమానా విధించడంతో పాటు ప్రమాదాలకు కారణమైతే కేసు పెట్టి లోపలేస్తారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా (Kurnool District) లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడ ఝలిపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తుంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థ కూడా అందకే పనిచేస్తుంటుంది. ఐతే ట్రాఫిక్ రూల్స్ (Traffic Rules) బ్రేక్ చేసిన వారికి మాత్రం పనిష్మింట్ తప్పదు. స్పాట్ లో జరిమానా విధించడంతో పాటు ప్రమాదాలకు కారణమైతే కేసు పెట్టి లోపలేస్తారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా (Kurnool District) లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడ ఝలిపిస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో వాహనానికి సంబంధించిన సరైనపత్రాలు లేని వాహనాలను, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన వారిని, సీట్ బెల్ట్ ధరించకుండా కారు నడిపిన వారిని, వాహనాలపై పెండింగ్లో ఉన్నటువంటి చలానాలు చెల్లించని వారిని, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని. ఇలా ఎవరిని వదలడం లేదు. దొరికిన వారిని దొరికినట్టే పట్టుకొని వారిపై కేసులునమోదు చేస్తున్నారు. గడిచిననెల రోజులలో ఏకంగా పదివేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

ముఖ్యంగా ఇందులో నమోదైన కేసుల వివరాలు.

• డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై 1,016 కేసులు.

• హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపై 7,721 కేసులు, అలాగే మైనర్ల పై 66 కేసులు.

• నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ రోడ్డు మరియు వన్ వే లో వెళ్లిన వారిపై 157 కేసులు.

• సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై 253 కేసులు.

• సిగ్నల్ జంపింగ్ 7 కేసులు.

• ఎలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 12,120 కేసులు.

• సీటు బెల్టు ధరించకుండా కార్లు , జీపులు , తదితర వాహనాలు నడిపిన వారిపై 552 కేసులు.

• మితిమీరిన వేగంతో వెళ్లి న వాహనాల పై 2,618 కేసులు.

• ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాల పై మోటారు వాహనాల చట్టం కింద 385 కేసులు.

• త్రిబుల్ రైడింగ్ పై 1,351 మంది కేసులు.

• రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై 1,290 కేసులు.

• రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహానాల పై 701 కేసులు.

• నంబర్ ప్లేట్ లేని 556 వాహనాలను సీజ్

• డ్రంకెన్ & డైవింగ్ పై 52 కేసులు

మొత్తం 5 లక్షల 38 వేల ఈ – చలనాలు పెండింగ్ లో ఉన్నాయని ఈ నెలలో 34,589 ఈ – చలనాలను (రూ.72 లక్షల 87 వేల 965 రూపాయలను) రికవరీ చేశామన్నారు ట్రాఫిక్ పోలీసులు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News, Traffic rules