నన్ను చంపేస్తున్నారు... కాపాడండి... కేటీఆర్‌కు గల్ఫ్‌లో బాధితుడి కన్నీటి ఆవేదన...
KTR Tweet : గల్ఫ్ దేశాల్లో నరకం అనుభవిస్తున్న తెలుగు రాష్ట్రాల బాధితులకు లెక్క లేదు. వారిలో ఒకడైన సమీర్... తన బతుకు చిత్రాన్ని కేటీఆర్ ముందు ట్విట్టర్ వీడియో ద్వారా తెలిపి, తనను కాపాడమని వేడుకుంటున్నాడు.

గల్ఫ్ బాధితుడి కన్నీటి ఆవేదన (Image : Twitter)
- News18 Telugu
- Last Updated: May 15, 2019, 10:54 AM IST
అతని పేరు సమీర్. రాజన్న సిరిసిల్లా జిల్లా... ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన యువకుడు. గల్ఫ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెబితే నిజమే అనుకున్నాడు. రూ.80 వేలకు పైగా చెల్లించి... గల్ఫ్ వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్తే... ఉద్యోగమూ లేదు... ఏమీ లేదు. 300 గొర్రెలను అతనికి అప్పగించి... మనుషులు లేని ఎడారిలో వదిలేశారు. తాను ఈ ఉద్యోగం చెయ్యననీ, తనను తిరిగి తెలంగాణ పంపించెయ్యమంటే... నీ చావు నువ్వు చావు అంటూ అక్కడే ఉంచి రోజూ టార్చర్ పెడుతున్నారు. రోజూ కొడుతూ, చిత్ర హింసలు పెడుతున్నారని తన గోడును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వీడియో రూపంలో చెప్పుకున్నాడు బాధితుడు. 20 రోజులుగా తనకు కనీసం అన్నం కూడా పెట్టట్లేదనీ, రోజూ రాత్రి వేళ మరో ప్రాంతానికి తీసుకెళ్లి, చితకబాదుతున్నారనీ, తనను కేటీఆరే కాపాడాలంటూ కన్నీరు పెడుతున్నాడు సమీర్. అతని ఆవేదన ప్రతి ఒక్కరి హృదయాన్నీ కరిగిస్తోంది.
ఇప్పటికే ఇలాంటి ఎన్నో అంశాలపై సోషల్ మీడియా ద్వారానే స్పందిస్తూ, పరిష్కారం చూపిస్తున్న కేటీఆర్... ఈ విషయంపైనా వెంటనే స్పందించారు. సమీర్ని కాపాడాలనీ, అతను తిరిగి సేఫ్‌గా ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చెయ్యాలని... సౌదీ అరేబియా... రియాద్‌లోని భారత రాయబారికి రిక్వెస్ట్ పంపారు.
దశాబ్దాలుగా ఇదే చరిత్ర. ఏజెంట్ల మోసాలకు ఎంతో మంది బలైపోతున్నారు. అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో లక్షలు పెట్టి... సముద్రాలు దాటి... నా అన్న వారు ఎవరూ లేని దేశంలో అడుగుపెట్టి... పాస్‌పోర్ట్‌ను లాగేసుకుంటే, ఎవరికి చెప్పుకోవాలో తెలియక... నరకం అనుభవిస్తున్న వారికి లెక్క లేదు. అసలీ మోసాలు ఎందుకు జరగాలి. గల్ఫ్ దేశాల్లో ఎందుకు మోసపోవాలి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఇవి కూడా చదవండి :
అమెరికాలో కూతుర్ని చంపేసిన సవతి తల్లి... శవాన్ని బాత్‌టబ్‌లో నగ్నంగా పడేసి...
శాలరీ అడిగితే అరాచకం... మహిళా ఉద్యోగిని చితకబాదిన బాస్
టీడీపీకి 110 సీట్లు... వైసీపీకి యూత్ ఓట్లు... చంద్రబాబు సర్వేల్లో తేలింది ఇదేనా..?
#కేటిఆర్_అన్న_నన్ను__కాపాడుండ్రీ#సౌదీలో_నన్నుసంపుతుండ్రు#రంజాన్_లో_ఉపవాసం_నాకు_చివరిమాసంగ ఉంది #సౌదీలో ఎజెంట్ మోసంతో నరకయాతన పడుతున్న తెలంగాణ రాష్ట్రం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెంది ఎండి సమీర్ అనే యువకుడు.తనను అదుకోవాలని అర్థనాదలు @KTRTRS @BTR_KTR pic.twitter.com/rVoDYXNStq
— Marupaka Anil Kumar (@kumar_marupaka) May 14, 2019
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఇంట్లో చోరీకి ప్రయత్నం
దిశ నిందితుల అంత్యక్రియలకు బ్రేక్... హైకోర్టు కీలక ఆదేశాలు...
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి
దిశ హంతకుల అంత్యక్రియలకు కొత్త చిక్కు...
ఆర్టీసీలో వారికి ఉద్యోగాలు... కేసీఆర్ హామీ అమలు...
కేసీఆర్‌కు సీనియర్ నేత షాకిస్తారా... నిర్ణయం అప్పుడే...
దశాబ్దాలుగా ఇదే చరిత్ర. ఏజెంట్ల మోసాలకు ఎంతో మంది బలైపోతున్నారు. అప్పులు చేసి ఏజెంట్ల చేతిలో లక్షలు పెట్టి... సముద్రాలు దాటి... నా అన్న వారు ఎవరూ లేని దేశంలో అడుగుపెట్టి... పాస్‌పోర్ట్‌ను లాగేసుకుంటే, ఎవరికి చెప్పుకోవాలో తెలియక... నరకం అనుభవిస్తున్న వారికి లెక్క లేదు. అసలీ మోసాలు ఎందుకు జరగాలి. గల్ఫ్ దేశాల్లో ఎందుకు మోసపోవాలి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
Loading...
ఇవి కూడా చదవండి :
నిజామాబాద్‌కి మరో మణిహారం... పూర్తికావచ్చిన నేచర్ పార్క్...