కృష్ణా జలాల పంపకం, ఇతర అంశాంలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని జలసౌధలో బుధవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. సుమారు ఐదు గంటలకుపైగా సమావేశం కొనసాగింది. అయితే ఈ సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేశారు. వివరాలు.. ఈ సమావేశం సందర్భంగా సాగర్, కృష్ణా డెల్టా కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో(Srisailam) విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఎంపీ సింగ్ అన్నారు. అయితే ఈ నిర్ణయంపై తెలంగాణ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేఆర్ఎంబీ సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నట్టుగా తెలంగాణ అధికారులు ప్రకటించారు.
ఈ సమావేశంలో.. కృష్ణా బేసిన్(Krishna Basin) నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్(Rayalaseema Lift Irrigation) పూర్తిగా అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించిన ప్రాజెక్టు అని.. జలవిద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని స్పష్టం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దిగువన సాగునీటి అవసరాలు లేనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తే తమకు నష్టం జరుగుతుందని వివరించారు. కృష్ణా నది(Krishna River) మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కడుతున్న ప్రాజెక్టులకు అనుమతి లేదని ఏపీ వాదించారు.
ఈ సందర్భంగా నాగార్జున సాగర్(Nagarjuna Sagar), కృష్ణాడెల్టాలో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని కేఈఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. దీంతో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది.
అనంతరం కృష్ణా, గోదావరి నదీ(Godavari River) యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ(GRMB) బోర్డుల చైర్మన్ల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశం జరుగుతోంది. సమావేశానికి రెండు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఈ సందర్భంగా చర్చించనున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.