హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Telangana: విద్యుత్ ఉత్పత్తి ఆపండి.. తెలంగాణకు కేఆర్ఎంబీ లేఖ.. ఏపీకి మరో లేఖ

AP Telangana: విద్యుత్ ఉత్పత్తి ఆపండి.. తెలంగాణకు కేఆర్ఎంబీ లేఖ.. ఏపీకి మరో లేఖ

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల ఆపాలని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. నాగార్జునసాగర్, పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల ఆపాలని సూచించింది.

కృష్ణా ప్రాజెక్టుల్లో జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈ మేరకు జెన్‌కో సంచాలకుడికి కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతాంగ్ లేఖ రాశారు. శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల ఆపాలని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. నాగార్జునసాగర్, పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల ఆపాలని సూచించింది. ఇక ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టవద్దన్న ఏపీకి కేఆర్ఎంబీ మరో లేఖ రాసింది. ఏపీ ఈఎన్సీకి బోర్డు సభ్యకార్యదర్శి హరికేష్ మీనా ఈ మేరకు లేఖ రాశారు.బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, ఆమోదం పొందకుండా పనులు చేయొద్దని కేఆర్ఎంబీ పేర్కొంది.

మరోవైపు నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై రేపు కేంద్రం గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర జలశక్తి గెజిట్లు విడుదల చేయనుంది. రెండు బోర్డులకు వేర్వేరుగా గెజిట్లు విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యం సంతరించుకుంది. గెజిట్లలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల చేయనున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Krishna River Management Board, Telangana

ఉత్తమ కథలు