Anandayya Letter to CM Jagan: సీఎం జగన్‌కు కృష్ణపట్నం ఆనందయ్య లేఖ.. ఆయన కోరిందల్లా ఒక్కటే..

ఆనందయ్య

ఏపీ సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ రాశారు. కరోనాకు విరుగుడుగా తాను తయారచేస్తున్న మందును ఒక్కో జిల్లాకు ఐదు వేల ప్యాకెట్లు పంపేందుకు సిద్ధమని ఆనందయ్య ఆ లేఖలో వివరించారు. ప్రభుత్వం ద్వారా తన మందును పంపిణీ చేయించాలని సీఎం జగన్‌ను ఆనందయ్య కోరారు. సామగ్రి సేకరణ, ఔషధం తయారీకి సహకరించాలని ప్రభుత్వాన్ని ఆనందయ్య అభ్యర్థించారు.

  • Share this:
    నెల్లూరు: ఏపీ సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ రాశారు. కరోనాకు విరుగుడుగా తాను తయారచేస్తున్న మందును ఒక్కో జిల్లాకు ఐదు వేల ప్యాకెట్లు పంపేందుకు సిద్ధమని ఆనందయ్య ఆ లేఖలో వివరించారు. ప్రభుత్వం ద్వారా తన మందును పంపిణీ చేయించాలని సీఎం జగన్‌ను ఆనందయ్య కోరారు. సామగ్రి సేకరణ, ఔషధం తయారీకి సహకరించాలని ప్రభుత్వాన్ని ఆనందయ్య అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. పొదలకూరు, మునుబోలు మండలాల్లో పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ఆనందయ్య మందును అందిస్తున్నారు. అయితే.. ఆనందయ్య మందు కోసం వచ్చే ఇతర ప్రాంతాల వారిని పోలీసులు అనుమతించడం లేదు. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కడప జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఆనందయ్య మందు పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది. మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాక.. మందు తెచ్చిన వాళ్లు ఆనందయ్య శిష్యులు కాదనే పుకార్లు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మందును నాగరాజు అనే వ్యక్తి సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మందు తెచ్చిన వారి వివరాలను స్థానిక వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. ఆనందయ్య మందును కృష్ణపట్నంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

    దేశవ్యాప్తంగా టీటీడీకి కల్యాణ మండపాలు, టికెట్ బుకింగ్ కేంద్రాలు ఉండటంతో టీటీడీ సేవలను మందు పంపిణీలో వినియోగించుకునే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆనందయ్య కంటి చుక్కల మందు విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కంటి చుక్కల మందు విషయంలో స్టెరిలిటీ పరీక్ష నిర్వహించాల్సి ఉందని.. అందుకు నెల నుంచి మూడు నెలల సమయం పడుతుందని నిపుణుల కమిటీ కోర్టుకు తెలిపింది.

    ఇది కూడా చదవండి: MP Raghurama: రఘురామ సెల్‌ఫోన్ సీజ్‌పై ప్రకటన విడుదల చేసిన ఏపీ సీఐడీ.. ఏం చెప్పిందంటే..

    ఆ వివరాలను పరిశీలించిన హైకోర్టు.. కంటి చుక్కల మందుకు సాధ్యమైనంత త్వరగా స్టెరిలిటీ పరీక్ష నిర్వహించి రెండు వారాల్లోగా నివేదిక పొందేలా చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్‌ను ఆదేశించింది. ఆనందయ్య ‘కె’ మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో.. మందు పంపిణీకీ ఎలాంటి ఆటంకాలూ కలిగించవద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణను హైకోర్టు జూన్ 21కి వాయిదా వేసింది.
    Published by:Sambasiva Reddy
    First published: