Omicron Ayurveda Medicine: ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎన్నో దేశాలకు వ్యాపించింది.. ఇప్పుడు భారత దేశాన్ని కూడా భయపెడుతోంది. కరోనా సెకెండ్ వేవ్ (Corona Second Wave) భయం పోయింది అనుకుంటుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. ఇప్పటికే భారత దేశలో కేసుల సంఖ్య 160 దాటింది. ప్రతి రోజు పదికి అటు ఇటుగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 200 మార్కు దిశగా పరుగులు పెడుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఒక కేసు నమోదుకాగా.. అతను కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ (Telangana)లో మాత్రం 20 కేసుల వరకు నమోదుకావడం కలవరపెడుతోంది. అందులో ఒకరి పరిస్థితి సీరియస్ గా కూడా ఉంది. దానికి తోడు నిత్యం 2 వేల మందికిపైగా విదేశాల నుంచి వస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వారిలో కొందరి ఆచూకీ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు భయం తప్పడం లేదు. అయితే ఈ ఒమిక్రాన్ గురించి అంత ఆందోళన అవసరం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య.
కరోనా సెకెండ్ వేవ్ సమయంలో నెల్లూరు జిల్లా (Nellore District) కృష్ణపట్నం ఆనందయ్య మందు ఎంతో ఆసక్తి పెంచింది. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో మందు బాగా పని చేస్తోందంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది.. దీంతో ఆయన ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఆనందయ్య మందు కోసం తెలుగు వారే కాకుండా చుట్టు పక్కల రాష్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆనందయ్య మందు కొంతకాలం ఆగిపోయిన.. మొత్తానికి ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వడంతో మందు పంపిణీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మందుకు ఎంతో డిమాండ్ పెరిగింది. నిత్యం వేలమంది ఆయన మందుకోసం క్యూ కట్టడం.. తరువాత ప్రభుత్వ ఆంక్షలు.. వ్యవహారం కోర్టుదాకా వెళ్లడం చకచకా జరిగిపోయాయి. చివరికి అనుమతి రావడంతో ఆయన మందు పంపిణీ కొనసాగింది. తాజాగా ఆయన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు సంబంధించి మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్యే రోజా యాక్టర్ కాకపోతే డాక్టర్ అయ్యేవారా..? ఆమె మనసులో మాట ఇదే..
ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆనందయ్య చెబుతున్నారు. ధన్వంతరి భారతీయులకు వరమని.. శీతాకాలంలో ముందస్తుగా ఒమిక్రాన్‌తో పాటూ ఇతర వ్యాధులు సోకకుండా ఆయుర్వేద మందును ఇప్పటికే తయారు చేయడం జరిగింది అన్నారు. అందరికీ అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకూ 15 రోజులకు ఒకసారి తాను తయారు చేసిన మందు వాడితే ఎలాంటి సమస్య రాదు అంటున్నారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ పై ఉన్న అభిమానం ఇది.. బైరెడ్డా మజాకా అంటున్న వైసీపీ ఫ్యాన్స్
ఒమిక్రాన్‌కి సంబంధించిన మందును కృష్ణపట్నంతో పాటు విశాఖపట్నంలోను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నా.. ఇతర సమాచారం కోసం తమ సెల్ నంబర్ 9100036881ని సంప్రదించాలని ఆనందయ్య కోరారు. మరి చూడాలి కరోనా సెకెండ్ వేవ్ లోనూ ఆనందయ్య మందు ఎంత ఫేమస్ అయ్యిందో.. అంతే వివాదాస్పదంగా మారింది. తాజాగా ఆయన ప్రకటన ఎలాంటి దుమారం రేపుతుందో చూడాలి.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఓ వైపు ఆయుర్వేద మందు తయారు చేస్తున్న ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని మరోసారి ప్రకటించారు. అన్ని రాజకీయ పెర్టీలు బీసీలను విస్కరిస్తున్నాయని తెలిపారు. బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీ పెడతామన్నారు. బీసీ కులాలతో కలిసి ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, AP News, Omicron, Omicron corona variant