ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీ.. కృష్ణా బోర్డు సమావేశం నేడే..

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్

తెలంగాణ, ఏపీ మధ్య నీటి గొడవ తలెత్తడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరిగే కృష్ణాబోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Share this:
    తెలంగాణ, ఏపీ మధ్య నీటి గొడవ తలెత్తడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరిగే కృష్ణాబోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. బోర్డు చైర్మన్‌ పరమేశంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు పాల్గొనే ఈ సమావేశంలో.. ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ అంశంతో పాటు, టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు, ఈ వాటర్‌ ఇయర్‌లో నీటి పంపిణీ, మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఏపీ సర్కారు చేపట్టనున్న పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్టులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు, డిండి వంటి పలు ప్రాజెక్టులపై ప్రముఖంగా చర్చిస్తారు.

    అటు.. గోదావరి బోర్డు సమావేశం శుక్రవారం జరగనుంది. దీనికి సంబంధించి ఎజెండా అంశాలను గోదావరి బోర్డు సిద్ధం చేసింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, బోర్డుకు నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం, టెలిమెట్రీ ఏర్పాటు తదితర అంశాలను ఎజెండాలో చేర్చింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: