హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rayalaseema Lift Irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి కేఆర్ఎంబీ మధ్యంతర నివేదిక..అందులో ఏముందంటే..

Rayalaseema Lift Irrigation: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి కేఆర్ఎంబీ మధ్యంతర నివేదిక..అందులో ఏముందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్రం మరో అధికారిని నామినేట్ చేసిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తామని.. అనంతరం పూర్తి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది. దేవేందర్‌ స్థానంలో మరో వ్యక్తిని నామినేట్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కోరినట్లు బోర్డు తెలిపింది.

ఇంకా చదవండి ...

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతున్న విషయం తెలిసిందే. అనుమతి లేకున్నా ప్రాజెక్టు కడుతున్నారంటూ ఎన్జీటీలో కేసులు వేసింది. అక్కడి పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT)కి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మధ్యంతర నివేదిక సమర్పించింది. పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు కావాలని ఎన్జీటీని కేఆర్ఎంబీ కోరింది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వచ్చే బృందంలో తెలంగాణకు చెందిన వారు ఎవరూ ఉండకూడదని ఏపీ వాదిస్తోంది. బోర్డులో తెలుగు రాష్ట్రాల వారు లేకుండా చూడాలని ఎన్జీటీ సైతం కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేసింది. ఐతే రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన బృందంలో తెలంగాణకు చెందిన దేవేందర్ రావు ఉండటంపై ఏపీ సర్కార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆయన స్థానంలో మరో వ్యక్తిని నామినేషన్ చేయాలని కేంద్రజలశక్తి శాఖను కోరినట్లు కేఆర్ఎంబీ తెలిపింది.

కేంద్రం మరో అధికారిని నామినేట్ చేసిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తామని.. అనంతరం పూర్తి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది. దేవేందర్‌ స్థానంలో మరో వ్యక్తిని నామినేట్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కోరినట్లు బోర్డు తెలిపింది. నామినేట్‌ చేసిన వెంటనే ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఎత్తిపోతల పరిశీలనకు వెళ్తామని బోర్డు స్పష్టం చేసింది. అనంతరం పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది. తెలుగు రాష్ట్రాల గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కృష్ణా నది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం.. కృష్ణా నదిపై ఉన్న 36 ప్రాజెక్టులు కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB), గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) పరిధిలోకి వెళ్తాయి. ప్రాజెక్టుల భద్రత కూడా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుంది.

అక్టోబరు 14 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు సీడ్‌ మనీ కింద రూ. 200 కోట్ల చొప్పున 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాలి. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలి. అనుమతిలేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు రాకుంటే ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ సమర్థించగా.. తెలంగాణ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 9న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాయి. ఐతే సోమవారం నిర్వహించ తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాలని ఇరు బోర్డులకు సంబంధించిన ఛైర్మన్లకు తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ లేఖ రాసింది. రేపటి సమావేశాన్ని వాయిదా వేసి, మరో తేదీన సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Krishna River, Krishna River Management Board

ఉత్తమ కథలు