ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు.. నీటి విడుదలను వెంటనే ఆపండి..

ప్రతీకాత్మక చిత్రం

సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి 158.255 టీఎంసీలను KRMB కేటాయిచింది. ఐతే ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు గుర్తించింది.

  • Share this:
    ఏపీ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాగర్‌ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి KRMB సభ్యకార్యదర్శి పరమేశం లేఖ రాశారు. మే నెల వరకు ఏపీకి చేసిన కేటాయింపుల కన్నా ఎక్కువ నీటిని వినియోగించుకున్నారని లేఖలో పేర్కొన్నారు. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని.. నీటి విడుదలను ఆపేయాలని ఆదేశించింది బోర్డు.

    సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి 158.255 టీఎంసీలను KRMB కేటాయిచింది. ఐతే ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు గుర్తించింది. అటు హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించారు. వాటి ద్వారా ఇప్పటి వరకు 48.328 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు వెల్లడించింది. రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని.. కానీ ఏపీ పరిమితికి మించి ఎక్కువ జలాలను వాడుకుంటోందని KRMB తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా కాల్వల ద్వారా నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published: