హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తెలంగాణ, ఏపీకి కృష్ణా జలాల కేటాయింపు.. ఏ రాష్ట్రానికి ఎంతంటే..?

తెలంగాణ, ఏపీకి కృష్ణా జలాల కేటాయింపు.. ఏ రాష్ట్రానికి ఎంతంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణకు కేటాయించిన 36 టీఎంసీలు, ఏపీకి కేటాయించిన 17 టీఎంసీల నీటిని ఆగస్టు 31 వరకు వాడుకునేనలా కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు ఇచ్చింది.

  తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంచాయితీ జరుగుతున్న వేళ.. ఇరురాష్ట్రాలకు కృష్ణా జలాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. తెలంగాణ 36 టీఎంసీలు, ఏపీ 17 టీఎంసీల నీటిని వాడుకునేందుకు బుధవారం అనుమతి ఇచ్చింది. ఐతే తెలంగాణ అడిగిన క్యారీ ఓవర్ నీటి విషయంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణకు కేటాయించిన 36 టీఎంసీలు, ఏపీకి కేటాయించిన 17 టీఎంసీల నీటిని ఆగస్టు 31 వరకు వాడుకునేనలా కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు ఇచ్చింది.

  కాగా, ఏపీ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సమైక్య రాష్ట్రంలోనే నదుల నీటివాటాలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని తన పిటిషన్‌లో పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ప్రస్తావించింది. రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తూ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యర్థించింది. ఈ ఫైలింగ్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: AP News, Krishna River, Krishna River Management Board, Telangana

  ఉత్తమ కథలు