హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Dragonfly: కోనసీమవాసుల్లో టెన్షన్ టెన్షెన్.. ప్రమాదం పొంచి ఉందా..? తూనీగలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి..?

Dragonfly: కోనసీమవాసుల్లో టెన్షన్ టెన్షెన్.. ప్రమాదం పొంచి ఉందా..? తూనీగలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి..?

తూనిగలు మెసేజ్ ఇస్తున్నాయా..?

తూనిగలు మెసేజ్ ఇస్తున్నాయా..?

Dragonflies Flying: ఇప్పటికే కరోనా కోరలు చాచి మనుషుల ప్రణాలను తీసేస్తోంది. వీటికి తోడు వైరల్ ఫీవర్లు విస్తరిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు తుఫాన్లు ముంచుకొస్తున్నాయి. ఇప్పుడు కోనసీమ వాసులకు మరింత భయం పడుతున్నారు. త్వరలో ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని చర్చించుకుంటున్నారు. తూనీగలు తమకు మెసేజ్ ఇస్తున్నాయి అంటున్నారు.. అసలు ప్రమాదానికి.. తూనీగలకు సంబంధం ఏంటి..?

ఇంకా చదవండి ...

Dragonflies Flying Messege: భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఎలాంటి ప్రమాదం వస్తుంది అన్నది అధ్యయనం చేసి నిపుణులు హెచ్చరిస్తుంటారు. కరోనా ఫస్ట్ వేవ్ (Corona First wave) సమయంలోనూ..  కరోనా సెకెండ్ వేవ్ (Corona Second wave) మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇప్పుడు థర్డ్ వేవ్ (Corona Third Wave) కూడా అక్టోబర్, నవంబర్ లో ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. ఇక తుఫాన్ల గురించి అయితే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉంటుంది. ముందుగానే అధికారులను, ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరిస్తూ ఉంటుంది. వాతావరణాన్ని హైటెక్ శాటిలైట్ ఇమేజింగ్ ఉపయోగించి అంచనా వేసినప్పటికీ.. అయితే ఇప్పటికే గ్రామీన ప్రాంత రైతులు మాత్రం ఈ తుఫాను హెచ్చరికలు కంటే.. ప్రకృతి ఇచ్చే సంకేతాలను నమ్ముకుంటారు. నదీ తీర ప్రాంత ప్రజలు వరదలు, తుఫానులు, కరువును సంప్రదాయ మార్గంలో అంచనా వేస్తారు. అలాగే కోనసీమ వాసులు తూనీగలు (Dragonflies) తమకు మెసేజ్ ఇస్తాయని నమ్ముతూ ఉంటారు. తర తరాల నుంచి రైతులు, మత్స్యకారులకు ఇవి ఎలాంటి సమాధానం అందిస్తాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు ప్రకృతిలో వచ్చే మార్పును చెబుతుంటారు.

అసలు తూనీగలు రాబోయే వర్షం గురించి హెచ్చరించగలవా..?

తీరప్రాంతవాసులు తూనీగలు ఎత్తుకు ఎగురుతుంటే ఈ రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తుంటారు. అదే తక్కువ ఎత్తులో ఎగురుతుందంటే మరికాసేపట్లో వర్షం రానుందని.. తూనిగలు గుంపులుగా కనిపిస్తే ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని రైతులు నమ్ముతారు.

ఇదీ చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రెచ్చిపోతున్న పోకిరీలు.. ర్యాష్ డ్రైవింగ్.. తుపాకీ స్టంట్లతో అలజడి

ఇదే అంచనా ప్రకారం కోనసీమకు కొత్త ముప్పు పొంచి ఉందా..? ప్రకృతి విరుచుకుపడడానికి సిద్ధమవుతోందా..? జనంలో ఇప్పుడు ఇదే టెన్షన్‌.. ఏ వైపు నుంచి ఏం ముంచుకొస్తుందోనని వణుకుతున్నారు కోనసీమ వాసులు.. దీనికి కారణం.. లేకపోలేదు. ఇటీవల లక్షలాదిగా తూనీగలు కమ్ముకు వస్తుండడమే వారి భయానికి కారణం..

ఇదీ చదవండి: వంట నూనె రెండోసారి వాడుతున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రస్తుతం కోనసీమలో తూనీగల దండయాత్ర కొనసాగుతోంది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో లక్షలాది తూనీగలు సంచరిస్తున్నాయి. ఆకాశంలో ఎటు చూసినా తూనీగలే కనిపిస్తున్నాయి. దీంతో కోనసీమ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ వేలల్లో వచ్చే తూనీగలు ఈసారి లక్షల్లో రావడంతో వారిలో భయం పెరుగుతోంది. ఏదో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీనిపైనే అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదో జరుగుతోందని.. తూనీగలు తమకు మెసేజ్ ఇస్తున్నాయి అంటున్నారు.

ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో గులాబ్ బీభత్సం.. ఆరు జిల్లాలను వణికించిన తుఫాను. నష్టం ఎంతంటే..?

ప్రకృతి విపత్తులు వచ్చే ముందే తూనీగలు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సంచరిస్తాయనేది కోనసీమ వాసుల అనుమానం. తుఫాన్‌లు, సునామీలు సంభవించే ముందు ఇలా తూనీగలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. లక్షల్లో తూనీగలు వచ్చాయి కాబట్టి.. కచ్చితంగా ప్రకృతి విపత్తు భీకరంగా ఉండొచ్చన్నది వారి భయం.. కానీ కొంతమంది మాత్రం అలాంటిదేమీ లేదని.. అదంతా వారి గుడ్డినమ్మకం అని కొట్టి పారేస్తున్నారు..

First published:

Tags: Andhra Pradesh, AP News, East godavari, Heavy Rains

ఉత్తమ కథలు