Home /News /andhra-pradesh /

KONASEEMA FIRE ISSUE UPDATE POLICE PUT CASE ANOTHER 25 MEMBERS NGS

Konaseema: మొన్న 46 మంది.. తాజాగా మరో 25 మంది అరెస్ట్.. అమలాపురం అల్లర్ల కేసులో పోలీసుల దూకుడు.. వాట్సప్ గ్రూపులపై నిఘా?

మరో 25  మందిపై కేసు

మరో 25 మందిపై కేసు

Konaseema: కోనసీమ అల్లర్ల విషయంలో అరెస్టుల పర్వ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా వాట్స్ గ్రూపుల్లో చర్చల ద్వారానే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్పప్ గ్రూపు మెసేజ్ లపై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో మరికొన్ని అరెస్టులు తప్పేలా లేవు.

ఇంకా చదవండి ...
    Konaseema: పచ్చని కోనసీమ (Konaseema) అంటే ప్రశాంతతకు.. సంప్రదాయాలకు.. పెట్టింది పేరు.. అక్కడ ఆప్యాయతలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ అలాంటి కోనసీమ ఊహించని రీతిలో భగ్గుమంది. ఏకం మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పులు పెట్టే పరిస్తితికి దారితీసింది.  ఆ ఘటనకు కారణం ఎవరు అన్నదానిపై రాజకీయంగా రచ్చకు బ్రేక్ లు పడడం లేదు. మంత్రులు అయితే త్వరలోనే అందరి పేర్లు బయటకు వస్తాయని విపక్షాలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. విపక్షాలు కూడా అదే స్థాయిలో మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. కోనసీమ జిల్లా (Konaseema District) పేరు విషయంలో చిన్నగా మొదలైన ఆందోళనులు.. అమలాపురం (Amalapuram) లో హింసకు దారి తీయడంపై ఇప్పటికే ప్రజల్లో చాలానే అనుమానాలు ఉన్నాయి. స్థానికులు మాత్రం ఇదంతా ప్రభుత్వమే కావాలని చేసిందంటు మండిపడుతున్నారు. ఇక రాజకీయ దుమారం కూడా రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల తూటాలు ఆగడం లేదు. తప్పు మీది అంటే మీద అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అల్లర్ల వెనుక టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉన్నాయని వైసీపీ (YSRCP) ఆరోపిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీనే.. ఈ దారుణనానికి పాల్పడిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

    రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా.. ఈ హింసాత్మక ఘటనలకు కారణం ఎవరన్నదానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసుల దర్యాప్తుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది అన్నది పోలీసులకు మొత్తం తెలుసని.. ముందే సమాచారం ఉందని.. కేవలం అధికార పార్టీ ఈ ఘటనలకు పాల్పడి.. విపక్ష నేతలను టార్గెట్ చేయడమే పోలీసుల లక్ష్యం అంటున్నారు. వైసీపీ స్థానిక నేతలతో పాటు.. పార్టీ పెద్దలకు కూడా తెలిసే అంతా పక్కా ప్లాన్ చేశారని.. ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యే అరెస్ట్ తదితర అంశాలను పక్కదారి పట్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు అమలాపురంలో విధ్వంసకాండ జరిగి ఐదు రోజులు అవుతోంది. ఇప్పటికే అమలాపురంలో సాధారణ పరిస్థితులు అయితే కనిపించడం లేదు.

    ఇదీ చదవండి : వ్యవసాయ భూమి ఉందా? ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. 30 ఏళ్లు లాభాలు.. ఏడాదికి లాభం ఎంతో తెలుసా?

    తాజాగా మరోవైపు కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు చెప్పారు. ఈ అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు మరింత వేగడవంతా చేస్తున్నారు. అల్లర్లు, విధ్వంసం వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు 20 వాట్సప్ గ్రూపులను అందులోని సభ్యులను, 350 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ లను విశ్లేషిస్తున్నారు. అలాగే వీడియో క్లిప్పుంగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పుంగుల ఆధారంగా 70 మందిని గుర్తించినట్టు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. అరెస్టుల పర్వం ఇక్కడితో ఆగేట్టు లేదు.. బడా నేతల టార్గెట్ నే ఈ అరెస్టులు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు