కొల్లు రవీంద్రను రాజమండ్రి జైలుకు తరలింపు...

Kollu Ravindra | వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

news18-telugu
Updated: July 4, 2020, 4:00 PM IST
కొల్లు రవీంద్రను రాజమండ్రి జైలుకు తరలింపు...
కొల్లు రవీంద్ర (File)
  • Share this:
వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.  దీంతో పోలీసులు ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం ఉన్నట్టు భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద పోలీసులు కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకుని, అనంతరం అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనమన్నారు. కావాలనే కక్షసాధింపుతోనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారని చంద్రబాబు ఆరోపించారు. ‘ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదు. ప్రతిపక్షాలను ఇంతగా టార్గెట్ చేయలేదు. ఇంతమంది నాయకులను జైళ్లకు పంపలేదు. బీసీలంటేనే వైసీపీ పగబట్టింది. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రతీకారేచ్ఛతో చేస్తున్న ఈ అరెస్ట్ లను ప్రతిఒక్కరూ ఖండించాలి.’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading