మాజీ స్పీకర్ కోడెల కుమారుడిపై కేసు నమోదు...బిల్డర్‌కు బెదిరింపుల కేసులో ఏ3గా కోడెల శివరాం...

కోడెల శివరాం (Image : Facebook)

శివరామ్‌ అతని అనుచరులు డబ్బుల కోసం తమను వేధిస్తున్నారని కోటపాటి మల్లికార్జునరావు అనే బిల్డర్ పోలీసులను ఆశ్రయించారు. రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌ అనుమతికి రూ.17 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారని, అక్రమంగా వసూలు చేసేందుకు బెదిరింపులు పాల్పడినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Share this:
    మాజీ స్పీకర్‌ కోడెల తనయుడు కోడెల శివరామ్‌ పై నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. శివరామ్‌ అతని అనుచరులు డబ్బుల కోసం తమను వేధిస్తున్నారని కోటపాటి మల్లికార్జునరావు అనే బిల్డర్ పోలీసులను ఆశ్రయించారు. రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌ అనుమతికి రూ.17 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారని, అక్రమంగా వసూలు చేసేందుకు బెదిరింపులు పాల్పడినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో కోడెల శివరామ్‌ అతని ఆంతరంగికుడు గుత్తా నాగప్రసాద్, ఇంజినీర్‌ వేణుగోపాల్‌రావులపై నరసరావుపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రామిరెడ్డిపేటకు చెందిన బిల్డర్ మల్లికార్జున రావు రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అపార్ట్‌మెంట్‌ నిర్మించేందుకు అనుమతుల కోసం ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాల్‌రావును రెండేళ్ల క్రితం సంప్రదించాడు. అనుమతులు కావల్సిన పత్రాలతో పాటు చెల్లించాల్సిన ఫీజులు అందించాడు. అయితే అనుమతులు ఇవ్వకుండా వేణుగోపాల్‌రావు కాలయాపన చేశాడు. అయితే పనులు ప్రారంభమై సగం పూర్తి అయిన సమయంలో కోడెల శివరామ్‌కు మామూలు చెల్లిస్తేనే అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పూర్తవుతుందని ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ రావు హెచ్చరించాడు. అయితే మల్లికార్జునరావు బెదిరింపులు పట్టించుకోకుండా నిర్మాణం కొనసాగించడంతో అధికారులు పనులను నిలిపివేశారు. కోడెల శివరామ్‌కు కట్టాల్సిన మామూళ్లు చెల్లించిన తర్వాతే నిర్మాణం చేయాలని బెదిరించారు.

    అయితే ఈ వ్యవహారంలో బిల్డర్ మల్లికార్జున రావును గుంటూరులోని కోడెల శివరామ్‌ ను కలవగా, అక్కడ కోడెల శివరాం పిఏ గుత్తా ప్రసాద్‌ ఫ్లాట్ కు రూ.50 వేల చొప్పున డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ లెక్కన మొదటి దఫాలో రూ.8లక్షలు, మరోసారి రూ. 6 లక్షలు చొప్పున చెల్లించినట్లు బిల్డర్ పేర్కొన్నారు. ఇలా మొత్తం రూ.14 లక్షలు ముట్టచెప్పారు. మిగిలిన రూ.3 లక్షల కోసం మునిసిపల్ ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాలరావు గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ వ్యవహారంలో బాధితుడు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో అపార్ట్‌మెంట్‌ అనుమతుల వ్యవహారంలో బెదిరించి నగదు వసూళ్లు చేసిన కోడెల శివరామ్, అతని పీఏ గుత్తా ప్రసాద్, ఇంజినీర్‌ వేణులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. ఈ కేసులో
    A1గా ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాలరావు,  A2 గా గుత్తా నాగ ప్రసాద్, కోడెల శివరాం A3గా ఉన్నారు.
    First published: