కోడెలను వివాదాల్లోకి నెట్టిన కుమారుడి వ్యవహారం..?

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

కోడెల కుమారుడు శివరామకృష్ణ చేసిన పని కూడా ఆయనకు సమస్యగా మారిందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అందుకు కోడెల కోడలు పద్మప్రియ.. తన కుమారుడు గౌతమ్‌ను కిడ్నాప్ చేశారని చేసిన ఫిర్యాదే ప్రధాన కారణం.

 • Share this:
  కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆయన ఆత్మహత్యకు వరుస కేసులతో పాటు కుటుంబంలో నెలకొన్న తగాదాలు కారణాలని ప్రచారం జరుగుతోంది. ఏపీ స్పీకర్‌గా ఉన్నప్పటి నుంచే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును, టీడీపీకి చెందిన కొందరు సభ్యులను అవమానించే రీతిలో మాట్లాడారన్న ఆరోపణలపై రోజాను యేడాది పాటు సస్పెండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆదేశించారు. దీంతో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని కూడా స్పీకర్‌గా ఆయన సమర్థించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐదేళ్ల పాటు ఆయన స్పీకర్‌గా ఉండగా, ఆ కాలమంతా వివాదాల్లోనే ఉన్నారు. అయితే, కుటుంబ వివాదాలు కూడా కోడెలను ఇబ్బందుల్లోకి నెట్టాయి.

  కోడెల కుమారుడు శివరామకృష్ణ చేసిన పని కూడా ఆయనకు సమస్యగా మారిందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అందుకు కోడెల కోడలు పద్మప్రియ.. తన కుమారుడు గౌతమ్‌ను కిడ్నాప్ చేశారని చేసిన ఫిర్యాదే ప్రధాన కారణం. శివరామకృష్ణ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, 2009 ఆగస్టులో తనను పెళ్లి చేసుకున్నాడని, అనంతరం తమ ఇద్దరి మధ్య మనస్పర్థలతో వివాదాలు చోటుచేసుకున్నాయని, అత్తింటివారి వేధింపులను తట్టుకోలేకపోతున్న తనను పలు మార్లు గెంటేశారని పద్మప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2010లో తమకు బాబు పుట్టిన తరువాత కూడా తనను ఇంటి నుంచి గెంటేశారని ఆమె తెలిపారు. కోడెల అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వేధింపులు పెరిగాయని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. వారి వేధింపులు తట్టుకోలేక కుమారుడితో పాటు, 2013లో కన్నవారింటికి వచ్చేశానని.. అయితే, శివరామకృష్ణ తన ఇంటిపై దాడి చేసి గౌతమ్‌ను ఎత్తుకుపోయాడని ఆమె ఫిర్యాదు చేశారు.

  అప్పట్లో ఈ కేసు వ్యవహారం కోడెల శివప్రసాదరావును ఇబ్బందుల్లోకి నెట్టింది. మహిళలపై కోడెల తీరుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: