కోడెల శివప్రసాదరావు మరణంపై... నేతలు ఎవరేమన్నారంటే...

కోడెల శివప్రసాదరావు(ఫైల్ ఫోటో)

Kodela Siva Prasad Death : కోడెల మరణం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆశ్చర్యంలో పడేస్తోంది. ముఖ్యంగా టీడీపీ నేతలకు విషాదంతోపాటూ... ఆయన మరణంపై కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

  • Share this:
నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని కొందరు నేతలు అంటుంటే... ఆయన మరణంపై అనుమానాలు కలుగుతున్నాయని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కోడెలను చనిపోయిన తర్వాతే... బసవతారకం ఆస్పత్రికి తీసుకురావడంతో... ఆయన మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని కొందరు నేతలు అంటున్నారు. ఐతే... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ వంటివారు... కోడెల శివప్రసాదరావు మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

కోడెల శివప్రసాదరావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.కోడెల శివప్రసాదరావు రాజకీయంగా ప్రజలకు చేసిన సేవల్ని ఏపీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు.కోడెల మరణంపై టీడీపీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది.కక్ష సాధింపు రాజకీయాల వల్లే కోడెల మరణించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.కోడెల కుటుంబ సభ్యులకు నారా లోకేష్ తన సంతాపం తెలిపారు.కోడెలది మరణంలా లేదనీ... ప్రభుత్వ వేధింపుల వల్లే ఇలా జరిగినట్లుందనే అభిప్రాయపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి.కోడెల మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెల మరణం విషాదకరం అని జనసేన పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.కోడెల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు టీడీపీ నేత సిద్ధా రాఘవరావుకోడెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

First published: