హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani: చంద్రబాబు అలా చేయొద్దు.. ఏపీ మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి

Kodali Nani: చంద్రబాబు అలా చేయొద్దు.. ఏపీ మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

Kodali Nani Slams Chandrababu Naidu: 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి మోకాలడ్డుతున్న చంద్రబాబు తీరుపై కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  25 కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల మంది ఇళ్ల స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకోవద్దని ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. ఇప్పటికైనా కేసులను ఉపసంహరణ చేసుకోవాలని సూచించారు. కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కోర్టుల్లో వేసిన స్టేను చంద్రబాబు వెకేట్ చేస్తే డిసెంబర్ 21 సీఎం జగన్ పుట్టిన రోజున టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల కేసుల విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకోక పోతే టిడ్కో ఇళ్ల ముందే నేను ఆందోళన చేపడతానని కొడాలి నాని హెచ్చరించారు.

  30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి మోకాలడ్డుతున్న చంద్రబాబు తీరుపై కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడ్కోలో 13 లక్షల ఇల్లు ఎక్కడ కట్టించారో చంద్రబాబు చూపించాలని డిమాండ్‌ చేశారు. డెబ్బై ఏళ్లు వచ్చినా అబద్ధాలు చెప్పే అలవాటు మానుకోవడం లేదంటూ ఆయనపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మతాలు, కులాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మంత్రి కొడాలి నాని అన్నారు.

  నంద్యాల షేక్‌ అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తుకువస్తున్నాడని విమర్శించారు. నంద్యాల ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్‌, సామూహిక ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, టీడీపీకి చెందిన రామచంద్రరావు మాత్రం నిందితులకు బెయిలు ఇప్పించారని ఆరోపించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Chandrababu naidu, Kodali Nani

  ఉత్తమ కథలు