సీనియర్ ఎన్టీఆర్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇన్నిరోజులు చంద్రబాబును వెన్నుపోటు దారునిగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయగా..తాజాగా సరికొత్త డిమాండ్ ను తీసుకొచ్చారు. అంతేకాదు దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామన్నారు. నందమూరి తారక రామారావు రాష్ట్ర సంపద అని, ఆయన ఎలా చనిపోయారో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన మృతిపై మిస్టరీ వీడాలని డిమాండ్ చేశారు.
నారా లోకేష్ పాదయాత్రలో చేసిన విమర్శలపై స్పందించిన కొడాలి నాని (Kodali Nani) ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో హరికృష్ణ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో హరికృష్ణ డిమాండ్ చేసినా కూడా సీఎంగా చంద్రబాబు సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని కొడాలి (Kodali Nani) ప్రశ్నించారు. ఎన్టీఆర్ మరణం తరువాత చంద్రబాబుకు అన్నీ అనుకూలంగా జరిగిన విషయాలను కొడాలి నాని (Kodali nani) గుర్తు చేశారు. 4 ఏళ్ల క్రితం వివేకానందరెడ్డి చనిపోతే సీఎం జగన్ కు కలిసి రావడం లేదన్నారు.
హరికృష్ణ డిమాండ్ చేసినా ఎన్టీఆర్ మృతిపై బాబు ఎందుకు విచారణ చేయలేదు ?#KodaliNani #PsychoCBN pic.twitter.com/OuRhHg33C4
— YSR Congress Party (@YSRCParty) February 4, 2023
ఎన్టీఆర్ చనిపోయాక ఆయన శరీరం నల్లగా ఎందుకు అయిందో చెప్పాలన్నారు. అలాగే ఎన్టీఆర్ మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదని కొడాలి తెలిపారు. ఎన్టీఆర్ కుటుంసభ్యులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రమాదాలు, గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయన్నారు. నందమూరి వారసులు వరుస ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండి నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.
తినడానికి తప్ప లోకేష్ నోరు ఎందుకూ పనికిరాదు. #KodaliNani #PsychoLokesh #EndOfTDP pic.twitter.com/c9v4klF9vw
— YSR Congress Party (@YSRCParty) February 4, 2023
ఇక లోకేష్ నోరు తినడానికి తప్ప దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఉన్న సెక్యూరిటీ నందమూరి తారకరత్నకు ఎందుకు లేదో అర్ధం కావడం లేదన్నారు. లోకేష్ కోసం 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్న విషయాన్ని కొడాలి నాని (Kodali nani) గుర్తు చేశారు. ఇక కోటంరెడ్డి చెప్పిన విషయాలు చిన్న చిన్నవని కొట్టిపడేశారు. మొత్తానికి టీడీపీని ఇరుకున పెట్టేలా కొడాలి వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Chandrababu Naidu, Kodali Nani, TDP