తిరుమలలో అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకునే విధానాన్ని ఎత్తి వేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఇది తన నావ్యక్తిగత అభిప్రాయమని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం జగన్ ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా తిరుమలకు వెళుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్ కేవలం హిందువుల ప్రతినిధిగా మాత్రమే తిరుమలకు వెళ్లడం లేదని అన్నారు. సీఎం జగన్‌ను డిక్లరేషన్‌పై సంతకం చేయాలనడం నీచ రాజకీయమని కొడాలి నాని మండిపడ్డారు.
సోము వీర్రాజుకు, చంద్రబాబుకు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని ఆయన అన్నారు. తాను చేసిన నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kodali Nani, Tirumala news