Home /News /andhra-pradesh /

KILO MUTTON PRICE 50 RUPEES ONLY IN CHITOOR DISTRCT DID YOU KNOW WHY RATE DECREASED NGS

Mutton Rate: నాన్ వెజ్ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. కేజీ మటన్ కేవలం 50 రూపాయలే.. ఎందుకో తెలుసా

కిలో మటన్ ధర 50 రూపాయలే

కిలో మటన్ ధర 50 రూపాయలే

Mutton Rate: ఈ మధ్య కాలంలో మటన్, చికెన్ రేట్లు కొండెక్కి కూర్చుంటున్నాయి. ముఖ్యంగా వీకెండ్స్ మటన్ కొనాలి అంటే భయపడే పరిస్థితి ఉంది. అప్పుడప్పుడూ వీక్ డేస్ లోనూ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో కిలో మటన్ కేవలం 50 రూపాయలు అంటే నమ్మశక్యం లేదా.. కానీ నిజం..

ఇంకా చదవండి ...
  Mutton Rate: నాన్‌వెజ్‌ ప్రియులకు (Non Veg Lovers) ఇది నిజమైన బంపర్ ఆఫర్.. అలాంటి ఇలాంటిది కాదు.. మాంసం ఇష్టంగా తినాలి అనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. సాధారణంగా బర్డ్ ఫ్లూ లేదా వైరస్ లు సోకాయి అని తెలిస్తే సడెన్ గా ఇలా రేట్లు పడిపోతాయి. కానీ ప్రస్తుతానికి అలాంటి భయం లేదు. పోనీ భారీగా రేట్లు కూడా పతనం అవ్వలేదు.. అయినా ఇలాంటి టైంలో కిలో 50 రూపాయలకు అమ్మారు.. దీంతో జనం ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు అని ఎగబడి మరీ ఆ ధరకు మటన్ కొనుక్కున్నారు. వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ ఉన్నా అంత తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది. ఒకప్పుడు పండగరోజే.. లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజునో మాంసం వండుకునేవారు.. కానీ, క్రమంగా నిత్యం మాంసాన్ని (Mutton) మనసారా ఆరగించేస్తున్నారు నాన్ వెజ్ ప్రియులు. దీంతో మాంసానికి డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది.. వారానికి రెండు మూడు రోజులైనా మటన్‌ లేదా చికెన్‌ ఉండాల్సిందే.. లేదా కనీసం సండే అయినా ముక్క ఉంటేనే ముద్ద దిగుతోంది.. ఏ ఫంక్షన్‌ అయినా.. ముక్క ఉంటేనే.. అది ఫంక్షన్‌ కింద లెక్క అనే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి.. హైదరాబాద్‌ (Hyderabad) లాంటి సిటీల్లో కిలో మటన్‌ ధర ఏకంగా 800 రూపాయలకు చేరిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అయితే చాలా చోట్ల 700 రూపాయల వరకు కూడా అమ్మారు.. ఇంత డిమాండ్ ఉన్న మటన్ మరి 50 రూపాయలకు ఎందుకు దొరికిందో తెలిస్తే షాక్ అవుతారు.

  చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో మటన్‌ ధరలు ఒక్కసారిగా ఇలా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం వ్యాపారస్తుల మధ్య నెలకొన్ని పోటీనే.. వారి మధ్య పోటీ కస్టమర్లకు పండగలా మారింది. మటన్‌ షాప్‌ నిర్వాహకులు పోటీపడుతూ ధరలను తగ్గించారు. దీంతో మటన్ కేవలం 50 రూపాయలకు కిలో అమ్ముడు పోయింది. దీంతో కొనుగోలు దారులు పోటీపడుతూ.. ఒక్కొక్కరు ఐదు కిలోల నుంచి 10 కిలోల వరకు ఎగబడి మటన్ కొనుగోలు చేశారు. అందివచ్చిన అవకాశాన్ని.. ఒడిసిపట్టారు.

  ఇదీ చదవండి: మీ ప్రాణ త్యాగం అవసరం లేదు.. కనీసం ఈ పని చేయండి అంటూ.. ఎంపీలపై పవన్ సెటైర్లు

  వాల్మీకిపురం గాంధీ బస్టాండు పక్కన మటన్‌ దుకాణాలు చాలానే ఉన్నాయి. అక్కడ ఓ దుకాణ దారుడు కేవలం 300 రూపాయలకే మటన్ అమ్మడం మొదలుపెట్టాడు. అతడు మూడు వందలకు తగ్గించడంతో భారీగా జనం క్యూ కట్టారు. దీంతో పోటీ పడి పక్క షాపు వ్యాపారి 200లకు అమ్మాడు. అది చూసి మరో షాపు వ్యక్తి 15కి.. ఇంకో షాపు వ్యాపారి వందకు.. ఇలా అందరూ ఒకరితో ఒకరు పోటీ పడి.. చివరికి 50 రూపాయలకు దించారు. ఇక అందరూ అక్కడితో ఆగిపోయారు. ఇలా పంతానికి, ప్రస్టేజ్‌కి పోయి పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు వ్యాపారులు. పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ ఇంత అతిగా కాదు అంటున్నారు ఈ విషయం తెలిసిన జనాలు

  ఇదీ చదవండి: ఒమిక్రాన్ కు మందు కావాలా? ఈ నెంబర్ కు కాల్ చేయండి.. 15 రోజులకు ఓసారి వాడితే చాలు

  50 రూపాయలకు కిలో మటన్ దొరుకుతోందనే వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా పోటెత్తారు.. రెండు కిలోలు, ఐదు నుంచి పది కిలోల వరకు కొనుగోలు చేశారు. మొత్తం మార్కెట్ లో సరుకు అంతా రాత్రి 7.30 గంటల వరకే అయిపోయింది. అయితే, గతం వారం రోజులుగా అక్కడ మాత్రం కిలో మటన్ 400 రూపాయల నుంచి 500 రూపాయలు పలికినట్టు సమాచారం..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chitoor, Mutton

  తదుపరి వార్తలు