కిడ్నాపైన పిల్లాడు సేఫ్... క్షేమంగా తల్లిదండ్రులను చేరిన జషిత్

తూర్పు గోదావరి జిల్లాలో కిడ్నాపైన జషిత్ క్షేమంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్లు బాలుణ్ని తెల్లవారుజామున వదిలి వెళ్లిపోవడం ఆనందకరం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 25, 2019, 10:25 AM IST
కిడ్నాపైన పిల్లాడు సేఫ్... క్షేమంగా తల్లిదండ్రులను చేరిన జషిత్
క్షేమంగా తల్లిదండ్రులను చేరిన జషిత్
  • Share this:
తూర్పు గోదావరి జిల్లా... మండపేటలో నాల్రోజుల కిందట కిడ్నాపైన నాలుగేళ్ల పిల్లాడు జషిత్ క్షేమంగా తల్లితండ్రుల్ని చేరాడు. తెల్లవారుజామున పిల్లాణ్ని కిడ్నాపర్లు రాయవరం మండలం కుతుకులూరు దగ్గర వదిలి పారిపోయినట్లు తెలిసింది. ఆ సమయంలో కొందరు కూలీలు పిల్లాణ్ని చేరదీశారు. ఎవరి తాలూకు అని అడగ్గా... పిల్లాడు చెప్పిన వివరాలతో... వెంటనే  పోలీసులకు కాల్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు... చిన్నారిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు పెట్టిన తల్లి నాగావళి... జషిత్‌ను దగ్గరకు తీసుకొని... ఆప్యాయంగా హత్తుకుంది. పిల్లాడు క్షేమంగా తమ దగ్గరకు చేరడంతో... తమకు సహకరించిన పోలీసులకు, మీడియాకూ, సోషల్ మీడియాకూ కృతజ్ఞతలు తెలిపారు జషిత్ తల్లిదండ్రులు. పోలీసులు కూడా మీడియా, సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్లే కిడ్నాపర్లు పిల్లాణ్ని వదిలి పారిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు. కిడ్నాపర్లను వదిలే ప్రసక్తి లేదన్న పోలీసులు... దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

kidnap,bank employee,east godavari,crime story,crime case,police case, andhra pradesh, telugu varthalu,తెలుగు వార్తలు,తూర్పు గోదావరి జిల్లా,కిడ్నాప్,క్రైమ్ స్టోరీ,క్రైమ్ కేసు,నేరాలు,పోలీస్ కేసు,
క్షేమంగా తల్లిదండ్రులను చేరిన జషిత్


తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని... విజయలక్ష్మినగర్‌లో జరిగిందీ ఘటన. జులై 22న బ్యాంక్ ఉద్యోగి కొడుకైన ఈ చిన్నారి నాయనమ్మతో కలిసి వాకింగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుండగా జషిత్‌ని దుండగులు బైక్‌పై వచ్చి ఎత్తుకుపోయారు. సోమవారం సాయంత్రం స్థానిక యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్న నూక వెంకటరమణ కుమారుడు జషిత్(4) ను నాయనమ్మ పార్వతి సమీపంలోని అపార్టుమెంట్ వద్దకు ఆదుకునేందుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ నుండి తాము నివసిస్తున్న విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ ప్రధాన రహదారి లోని శ్రీ సాయి ధరణి ప్లాజా కు చేరుకునేసరికి సినీఫక్కీలో ఓ ఆగంతకుడు ఆమెను కరెంటు ఉందా అంటూ ప్రశ్నించాడు. వెంటనే ఆమె పై పిడి గుద్దులు గుద్ది... గాయ పర్చాడు. వెంటనే బాలుడిని మోటర్ సైకిల్ పై ఎత్తుకెళ్లాడు. పోలీసులు అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరు కిడ్నాపర్లను గుర్తించారు. ఐతే... వాళ్లు ముఖాలకు కర్చీఫ్ కట్టుకోవడంతో... ఎవరు ఎత్తుకెళ్లారో, ఎందుకు పట్టుకుపోయారో తెలియలేదు.

క్షేమంగా తల్లిదండ్రులను చేరిన జషిత్


శ్రీకాకుళం నుండి వచ్చి: ప్రశాంతత కు పెట్టింది పేరు మండపేట. ఇక్కడ నివసిస్తున్న వారు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళేందుకు ఇష్టపడరు. అలాంటి పట్టణంలో కిడ్నాప్ కలవరపాటుకు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన భార్య భర్త లు చెరో బ్యాంక్ లో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నూక వెంకట రమణ ది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస స్వస్థలం. ఉద్యోగం లో స్థిరపడ్డ అనంతరం శ్రీకాకుళం పట్టణంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఆరు నెలలు క్రితం మండపేట యూనియన్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా వచ్చారు. ఈయన భార్య బెండీ నాగావళి కూడా స్థానిక కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ళ జషిత్ వున్నాడు. ముద్దులు ఒలికించే జషిత్ అంటే అక్కడి అపార్టుమెంట్లో వారందరికీ ఎంతో ఇష్టం. తిరిగి చిన్నారి తల్లి ఒడిని చేరడంతో... స్థానికులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

Published by: Krishna Kumar N
First published: July 25, 2019, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading