కిడారి హత్య కేసు ఎన్ఐఏకి బదిలీ.. నలుగురి అరెస్ట్

జాతీయ స్థాయిలో మావోయిస్ట్ సమస్యపై కేంద్రం సీరియస్‌గా ఫోకస్ చేసిన నేపథ్యంలో.. కిడారి హత్య కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్రం కోరినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: December 15, 2018, 10:14 AM IST
కిడారి హత్య కేసు ఎన్ఐఏకి బదిలీ.. నలుగురి అరెస్ట్
మావోల కాల్పుల్లో మృతి చెందిన కిడారి సర్వేశ్వరరావు (ఫైల్ ఫొటో)
  • Share this:
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసును ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)కి బదిలీ చేశారు ఏపీ పోలీసులు. సెప్టెంబర్ 23వ తేదీన కిడారితో పాటు మాజీ ఎమ్మెల్యే సోమును మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు విచారణ చేస్తూ వచ్చిన ఏపీ పోలీసులు తాజాగా కేసును ఎన్ఐఏకి బదిలీ చేశారు.

జాతీయ స్థాయిలో మావోయిస్ట్ సమస్యపై కేంద్రం సీరియస్‌గా ఫోకస్ చేసిన నేపథ్యంలో.. కిడారి హత్య కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించాలని కేంద్రం కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ పోలీసులు కేసును ఎన్ఐఏకి బదిలీ చేయడం.. ఎన్ఐఏ రంగంలోకి దిగడం జరిగిపోయాయి. గత మూడు రోజులుగా దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ ఇప్పటికీ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్నవారిలో సుబ్బారావు, శోభన్,ఈశ్వరి, కొర్ర కమల సహా మరికొందరు ఉన్నారు. అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
Published by: Srinivas Mittapalli
First published: December 15, 2018, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading