ఏపీలో మరిన్ని పెట్టుబడులు.. కియా మోటర్స్ కీలక ప్రకటన

ఏపీలో మరిన్ని పెట్టుబడులు.. కియా మోటర్స్ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు.

 • Share this:
  ఏపీలో మరిన్ని పెట్టుబడులకు కియా మోటర్స్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో మరో 54 మిలియన్ డాలర్లు అదనంగా పెట్టుబడులు పెడతామని కియా సీఈవో కూక్యూన్ షిమ్ ప్రకటించారు. కియా suv వాహనాల తయారీకి కోసం కొత్తగా పెట్టుబడులు పెడుతున్నామని వెల్లడించారు. మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కియాకు బలమైన బంధం ఉందని కూక్యూన్‌ తెలిపారు.

  కాగా, కియా సంస్థ విష‌యంలో గ‌తంలో ఏపీలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అనంత‌పురంలో చంద్రబాబునాయుడు హ‌యాంలో ప్రారంభ‌మైన కియా సంస్థ త‌మిళ‌నాడుకు వెళ్లిపోతోందని వ‌చ్చిన ఓ వార్త ఆధారంగా టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. సీఎం జ‌గ‌న్ చేత‌గానిత‌నం వ‌ల్ల‌, వైసీపీ నేత‌ల బెదిరింపుల వ‌ల్ల‌నే కియా వంటి గొప్ప సంస్థ ఏపీ నుంచి వెళ్లిపోతోంద‌ని మండిపడ్డారు. ఐతే కియాను తరలించడం లేదని సంస్థ ప్రతినిధులు క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెడతామని కియా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు