Andhra Pradesh: కరోనా వేళ.. ఏపీ ప్రభుత్వానికి కియా భారీ విరాళం.. ఎంతంటే..

సీఎం జగన్‌కు అందజేస్తున్న కియా ఎండీ

హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (HPCL) కూడా తన వంతు సాయం చేసింది. విశాఖపట్టణం జిల్లా కోవిడ్ రోగుల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చింది.

  • Share this:
    ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. భారీగా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం ఏపీలో లాక్‌డౌన్ అమలవుతోంది. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పారిశ్రామిక వేత్తలు ఆర్థిక సాయం చేస్తున్నారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నారు. తాజా కియా ఇండియా సంస్థ ఏపీకి భారీ సాయం అందజేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థకు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు కియా ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్ షిమ్‌ ఏపీ సీఎ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. ఈ నగదుతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలను కొనుగోలు చేయాలని కోరారు.

    అటు హిందూస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ (HPCL) కూడా తన వంతు సాయం చేసింది. విశాఖపట్టణం జిల్లా కోవిడ్ రోగుల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఆ డబ్బుతో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాఖ జిల్లా కలెక్టర్‌ను కలిసి చెక్కును అందజేశారు.

    మరోవైపు ఏపీలో కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసులు ఏ మాత్రం కంట్రోల్ కావడం లేదు. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య 23 వేలు దాటడం ఆందోళన పెంచుతోంది. అలాగే మరణాలు సైతం ప్రతి రోజూ 100 దాటడం కలవరపడేలా చేస్తోంది. గత 24 గంటల్లో 01,01, 330 మంది సాంపిల్స్ ను పరిశీలిస్తే.. అందులో 23, 160 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో 24 వేల 819 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని క్షేమంగా ఉన్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,82,41,637 సాంపిల్స్ ను పరిశీలించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటిన్ విడుదల చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published: