నెల్లూరు కోర్టులో జరిగిన ఫైళ్ల చోరీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సాక్ష్యాల చోరీని సుమోటాగా స్వీకరించిన హైకోర్టు (High Court) కేసును సీబీఐ (CBI)కి అప్పగించాలన్న పిటిషన్ పై సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేసు విచారణను సీబీఐ (CBI)కి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఈ కేసును ఏపీ హైకోర్టు సుమోటా పిల్ గా విచారణకు స్వీకరించింది. ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం ల్దని అందుకే ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు బృందానికి ఇవ్వాలని అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 18 మందిని ప్రతివాదులుగా చేర్చిన కోర్టు తాజాగా కేసును కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి : నెంబర్ 2 సహా.. అందరి కోరిక అదే.. మరి అధినేత పవన్ వారి నిర్ణయాన్ని గౌరవిస్తారా..?
డాక్యూమెంట్ల చోరీ ఇలా..
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandrashekar Reddy) పై అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి (Somireddy Chandrashekar Reddy) కి విదేశాల్లో భారీగా ఆస్తులున్నాయని దానికి సంబంధించిన కొన్ని పత్రాలను చూపించారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandrashekar Reddy) కాకాణి (Kakani Govardhan Reddy) పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కాకాని విడుదల చేసిన పత్రాలు ఫేక్ వి అని ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ క్రమంలో నెల్లూరులోని కోర్టులో డాక్యూమెంట్ల చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కోర్టులో చోరీ చేశారని సిబ్బంది గుర్తించారు. ఈ దొంగతనంలో కీలకమైన డాక్యూమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆ కేసు తీవ్ర చర్చనీయాంశం అయింది.
గతంలో మాటల యుద్ధం..
అయితే ఫైళ్లు మాయం అవ్వడంపై సోమిరెడ్డి, కాకాణి గోవర్ధన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే దీనిపై తాను సీబీఐ విచారణకు సిద్దమే అని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆ తరువాత హైకోర్టులో విచారణ జరగగా..తాజాగా ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి ఈ కేసు వెళ్ళింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Highcourt