హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Viveka: వివేకా హత్య కేసులో వేగంగా మారుతున్న పరిణామాలు.. తండ్రీ కుమారులకు సీబీఐ నోటీసులు.. తరువాత జరగబోయేది ఏంటి..?

YS Viveka: వివేకా హత్య కేసులో వేగంగా మారుతున్న పరిణామాలు.. తండ్రీ కుమారులకు సీబీఐ నోటీసులు.. తరువాత జరగబోయేది ఏంటి..?

ఎంపీ అవినాష్ రెడ్డి

ఎంపీ అవినాష్ రెడ్డి

YS Viveka: మాజీ మంత్రి వివేకా కేసులో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఒకే రోజు తండ్రి.. కొడుకలకు మళ్లీ సీబీఐ నోటీసులు పంపింది.. ఈ నెల 24న మధ్యాహ్నం విచారణకు హాజరుకావాల్సి ఉంది. మరి తరువాత జరగబోయేది ఇదేనా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

YS Viveka: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు పలు టర్న్ లు తీసుకుంటునే ఉంది. తాజాగా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి (MP Avinash Reddy) కి.. రెండోసారి నోటీసులు అందజేశారు. అవినాష్ రెడ్డితో పాటు తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి (YS Baskhar Reddy) సీబీఐ నోటీసులు పంపించింది. తాజా నోటీసుల నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఈ నెల 24న మధ్యాహ్నం విచారణకు హాజరుకానున్నారు. అవినాష్ రెడ్డి ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో, భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న పులివెందులలో విచారిస్తామని నోటీసుల్లో పేర్కొంది. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఆ రోజు విచారణకు హాజరు కాలేనంటూ భాస్కర్‌రెడ్డి సమయం కోరినట్లు సమాచారం. గతంలో సీబీఐ (CBI) అధికారులు సీఆర్పీసీ (CRPC) 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు నోటీసు ఇచ్చారు. గత నెల 28న విచారణకు హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రీ కుమారులను విచారణకు సీబీఐ పిలవడం చర్చనీయాంశంగా మారింది.

వివేకా హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను చెరిపేశారనే అభియోగాలపై అవినాష్‌ను మరోసారి సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌, ఎర్ర గంగిరెడ్డి ద్వారా ఆధారాలను చెరిపేశారని అభియోగాలున్నాయి. వివేకాను హత్య చేస్తే 40 కోట్ల ఆఫర్ చేశారని అభియోగం ఉంది. ఈ వ్యవహారంలో అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ చేయనుంది. అవినాష్‌రెడ్డి పాత్ర ఉందని తేలితే అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా ప్రశ్నించారు. ఈ విచారణలో అధికారులు పదుల సంఖ్యలో అడిగిన ప్రశ్నల్లో చాలా వరకు ఆయన సమాధానాలు చెప్పలేదని సమాచారం. వివేకా హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో ఆధారాల ట్యాంపరింగ్‌, సాక్ష్యాల విధ్వంసంపైనే సీబీఐ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి : చంద్రబాబు తూర్పుగోదావరి పర్యటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

కేసు నమోదు తర్వాత సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో లభించిన ఆధారాలు, అంతకుముందే ‘సిట్‌’ పోలీసులు జరిపిన దర్యాప్తు ప్రాతిపదికన ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించుకున్నారు. వేకానంద రెడ్డి ఒంటిపై గొడ్డలిపోటు గాయాలు కనిపిస్తున్నా... గుండెపోటుతో మృతి చెందినట్లు ఎందుకు ప్రకటించారని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.. అయితే ఈ కేసులో తరువాత ఏం జరుగుతుంది అన్నదే ఉత్కంఠ పెంచుతోంది. కేవలం విచారణలతో సీబీఐ కాలయాపన చేస్తుందా..? చర్యలు తీసుకునే అవకాశం ఉందా..? అని చర్చ జోరుగా జరుగుతోంది.. ఈ కేసులో సీబీఐ తరువాత స్టెప్ ఏంటి అన్నదే రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసిపోతాయి.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అయితే విపక్షాలు మాత్రం.. ఈ కేసుతో నేరుగా తాడెపల్లి సంబంధం ఉందని ఆరోపిస్తున్నాయి. సీఎం జగన్ కు ఆయన సతీమణి భారతి కూడా నోటీసులు ఇవ్వాలని.. వారిని విచారిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక ‘తీగ’ దొరికింది. అది... తాడేపల్లికి ‘కనెక్ట్‌’ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ విచారణ ప్రక్రియలో అవినాష్ రెడ్డి కాల్‌ డేటా అత్యంత కీలకంగా మారింది.

ఇదీ చదవండి : కన్నా వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. తాజా ఆరోపణలపై ఏమన్నారంటే..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఫిబ్రవరి 16న తెలంగాణ హైకోర్టులో వివేకా సతీమణి సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇదీ చదవండి : జనసేన అన్నారు.. టీడీపీ వైపు వెళ్తున్నారా..? అసలు కారణం ఇదే..?

వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పులివెందులకు చెందిన సునీల్ ను సీబీఐ 2021 ఆగస్టులో గోవాలో అరెస్టు చేసింది. గతంలో సునీల్ యాదవ్ కు బెయిల్ ఇచ్చేందుకు కడప జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టు నిరాకరించాయి. తరువాత సుప్రీంకోర్టు వైఎస్ వివేకా హత్య కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సునీల్ యాదవ్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Ycp, YS Avinash Reddy

ఉత్తమ కథలు