Home /News /andhra-pradesh /

KEY LEADERS HAVE FULL DAY CAMPAIGNS TODAY IN TELUGU STATES MAMATA KEJRIWAL TO COME TO AP TODAY NK

నేడు ఏపీకి మమతా బెనర్జీ, కేజ్రీవాల్... నేతల పర్యటనలు... ఎవరు ఎక్కడంటే...

కేజ్రీవాల్, మమతా బెనర్జీ

కేజ్రీవాల్, మమతా బెనర్జీ

AP Assembly Elections 2019 : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 10 రోజులే ఉండటంతో... నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఏపీ మొత్తం ఎండకు తోడు ఎన్నికల హీట్ ఎక్కువైంది.

రాజకీయాల్లో అసలైన కిక్కు తెప్పించేవి ఎన్నికలే. అవి వచ్చినప్పుడల్లా పార్టీల హడావుడి... నేతల పర్యటనలు, టికెట్ల కోసం ప్రయత్నాలు, ప్రచారం... అవీ ఇవీ... ఆ సందడే వేరు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీల అధినేతలు ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించేశారు. రెండోసారీ, మూడోసారీ పర్యటనలు చేస్తున్నారు. విశాఖలో ఇవాళ టీడీపీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు... బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్‌ కూడా టీడీపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. వన్‌టౌన్‌ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో వీళ్లు పాల్గొంటారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఉదయం 9.30 గంటలకు నెల్లూరు జిల్లాలోని గూడూరు, 11.30 గంటలకు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మధ్యాహ్నం 1.30 గంటలకు దర్శి, 3.30 గంటలకు కృష్ణాజిల్లాలోని మైలవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో జగన్‌ ప్రసంగిస్తారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. నిజానికి నిన్నే ఎన్నికల ప్రచారానికి రావాల్సి ఉన్నా... పోలీసు బందోబస్తు సమస్యతో ప్రచార షెడ్యూల్‌ని ఇవాళ్టికి వాయిదా వేశారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పవన్‌ పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు పలాస-కాశీబుగ్గ పట్టణంలోని పాతబస్టాండ్‌ వద్ద జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. తర్వాత రోడ్డుమార్గంలో పాతపట్నం చేరుకొని బస్టాండ్‌ దగ్గర బహిరంగసభలో మాట్లాడతారు. మధ్యా హ్నం 1.30 గంటలకు శ్రీకాకుళంలోని ఏడురోడ్లకూడలి దగ్గర జరిగే బహిరంగ సభలో పవన్‌ పాల్గొంటారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఇవాళ వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ అభ్యర్థి పీ రాములు తరపున ప్రచారం చేస్తారు. మహబూబ్‌నగర్ సమీపంలోని భూత్పూర్ మండలం అమిస్తాపూర్, వనపర్తి సమీపంలోని నాగవరం వద్ద నిర్వహించనున్న బహిరంగసభల్లో సీఎం ప్రసంగిస్తారు. నాగర్‌కర్నూల్‌లో సభ సాయంత్రం 4 గంటలకు, మహబూబ్‌నగర్ సభ 5.30 గంటలకు ప్రారంభమవుతుంది.

భూత్పూర్ వద్ద 100 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లుచేపట్టారు. 2015లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడే సభ నిర్వహించారు. రూ.35 వేల కోట్ల ప్రాజెక్టు ప్రారంభానికి గుర్తుగా ఉన్న వేదిక దగ్గరే సీఎం కేసీఆర్ మళ్లీ ప్రసంగించనుండటంతో పాలమూరు ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొన్నది.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, రాత్రి 7.30 గంటలకు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం రోడ్‌షోలలో పాల్గొంటారు. ఇలా నేతలంతా బిజీ షెడ్యూల్‌తో ఎన్నికల జోరు కొనసాగిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు తింటున్నారా... 21 ఆరోగ్య ప్రయోజనాలు

రాబోయే గుండె జబ్బుల్ని చేతి వేళ్లు ముందే చెబుతాయా?
First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, CM KCR, Janasena, Kcr, KTR, Lok Sabha Election 2019, Pawan kalyan, Ys jagan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు