హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో IASల సమావేశానికి 95 శాతం మంది గైర్హాజరు... చంద్రబాబు హ్యాపీ...

ఏపీలో IASల సమావేశానికి 95 శాతం మంది గైర్హాజరు... చంద్రబాబు హ్యాపీ...

చంద్రబాబు నాయుడు (File)

చంద్రబాబు నాయుడు (File)

Lok Sabha Election 2019 : సరిపడా కోరం సభ్యులు రాకపోవడంతో IASల సమావేశం కీలక నిర్ణయాలేవీ తీసుకోకుండానే వాయిదా పడింది.

  (రఘు - న్యూస్18తెలుగు కరెస్పాండెంట్, గుంటూరు)

  పున్నమి ఘాట్‌లోని హరిత హోటల్‌లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐఏఎస్ అధికారులు సమావేశం అయ్యారు. ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై రాజకీయ పార్టీల నుంచీ విమర్శలు వస్తుండటంతో ఐఏఎస్ అధికారుల సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి జవహర్ రెడ్డి, జేఎస్వీ ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు. ఐఏఎస్‌లపై రాజకీయ పార్టీల విమర్శలపై చర్చించాలనుకున్నారు. ముఖ్యంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని నిర్ణయించారు. ఈ భేటీలో ఐఏఎస్‌ల సంఘం కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోబోతున్నారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే అవేవీ ఆచరణలో అమలు కాలేదు. ప్రధానంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా పెట్టిన ఈ సమావేశానికి రావడానికి IASలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితంగా ఉండే కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అందువల్ల IAS అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది.


  సంఘంలో 184 మంది సభ్యులు ఉండగా, తాజా సమావేశానికి 14 మందే హాజరయ్యారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేశామని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే తమ సమావేశంలో ప్రధాన అజెండాగా భావించామనీ, కానీ చాలామంది అధికారులు రాకపోవటంతో సమావేశం నిర్వహించలేకపోయామని వివరించారు.

  కనీస స్థాయిలో సభ్యులు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి తీర్మానాలూ చేయలేదు. కనీసం అజెండాపై చర్చించే వీలు కూడా లేకుండా పోయిందని ప్రవీణ్ కుమార్ అన్నారు. కోరం ఉండాలంటే 46 మంది హాజరు కావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.


  చంద్రబాబుకు వ్యతిరేకంగా ఐఏఎస్‌లు సమావేశం అవుతున్నారనీ, ఎన్నికల్లో ఎలాగూ టీడీపీ ఓడిపోతుందనే ఉద్దేశంతో IASలు ఎదురు తిరుగుతున్నారనీ ఓవైపు జగన్ వర్గం ప్రచారం చేస్తున్న సమయంలో... సమావేశానికి 5 శాతం మందే... అది కూడా జగన్‌కు అనుకూల వర్గంగా పేరు ఉన్న 14 మంది ఐఏఎస్‌లే రావడం టీడీపీకి ఊరట కలిగించే అంశం. చంద్రబాబు మీద ఉన్న విశ్వాసం, ఆయనపై ఉన్న గౌరవం, ఆయన నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే 95 శాతం మంది... ఈ సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు టీడీపీ నేతలు.


   


  ఇవి కూడా చదవండి :


  ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...


  పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...


  చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...


  కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, IAS, Jagan, Lok Sabha Election 2019, Tdp, Ycp, Ys jagan, Ysrcp

  ఉత్తమ కథలు