Home /News /andhra-pradesh /

KCR MINISTER MINISTER SRINIVAS GOUD WARNS AP YS JAGAN GOVT OVER CANNABIS DRUG SMUGGLING MKS

వామ్మో! ఇదేందయ్యా? : ys jagan సర్కారుపై kcr ప్రభుత్వం అనూహ్య చర్య! -మంత్రి షాకింగ్ కామెంట్స్

ఏపీ, తెలంగాణ మధ్య కొత్త పంచాయితీ

ఏపీ, తెలంగాణ మధ్య కొత్త పంచాయితీ

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణ మధ్య మరో కొత్త గొడవ మొదలైంది. డ్రగ్స్ వ్యవహారంలో జగన్ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కేసీఆర్ సర్కారు హెచ్చరించింది. రెండు రాష్ట్రాల్లోనూ గంజాయి సహా ఇతర మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలపై యుద్ధం కొనాసగుతున్న తరుణంలో ఈ ఆరోపణల పర్వం కాకరేపుతున్నది..

ఇంకా చదవండి ...
కావడానికి రెండూ తెలుగు రాష్ట్రాలే అయినా, ఆంధ్రా, తెలంగాణల మధ్య కావాల్సినన్ని గొడవలున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఎంతకూ తెగకపోవడంతో చివరికి అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. విభజన్ సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ మధ్యే పెట్రోల్ ధరల వివాదంలో విభేదాలను పక్కనపెట్టి కేసీఆర్, జగన్ ఉమ్మడిగా కేంద్రంపై పోరు మొదలుపెట్టినట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ అంతలోనే మరో కొత్త గొడవ తెరపైకొచ్చింది. అనూహ్యరీతిలో జగన్ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించేదాకా వెళ్లిందీ వ్యవహారం. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. జగన్ సర్కారును ఉద్దేశించి చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్ అయ్యాయి..

ఏపీ తెలంగాణ మధ్య తాజా వివాదానికి కారణం డ్రగ్స్. అవును, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు, గంజాయి రవాణా వ్యవహారాలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి.. జగన్ సర్కారుపై కేసీఆర్ సర్కారు ఏకంగా కేంద్రానికీ ఫిర్యాదు చేస్తామనే స్థాయికి చేరాయి. గుజరాత్ లోని ముద్రా పోర్టులో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత తర్వాత, ఆ మాఫియా లింకులు ఏపీలోనూ ఉన్నాయని ప్రచారం జరగడం, ఏపీ డ్రగ్స్ రాకెట్ పై విపక్షాలు తారాస్థాయిలో ఆందోళనలు చేయడం, ఆ క్రమంలోనే బోషిడికే వివాదం చోటుచేసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత..

డ్రగ్స్ వ్యవహారంలో అలజడి పెరిగిన క్రమంలో ఏపీ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది జగన్ సర్కారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ గంజాయి సహా ఇతర మత్తుపదార్థాలు దొరికిన వాటిని దొరికినట్లు ధ్వంసం చేస్తున్నారు. విశాఖ మన్యంలో వందకొద్దీ ఎకరాల్లో గంజాయి పంటను అబ్కారీ పోలీసులు ధ్వంసం చేస్తోన్న వార్తలు ఏపీలో ప్రతిరోజూ వస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ డ్రగ్స్ పై యుద్దం ప్రకటించిన సీఎం కేసీఆర్.. మత్తుపదార్థాల రవాణాతో సంబంధాలున్న ఎంతటివారినైనా ఉపేక్షించొద్దని కఠిన ఆదేశాలివ్వడంతో పోలీసులు ఆమేరకు చర్యలకు దిగారు. అయితే, డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ పోరాటానికి ఏపీ అడ్డుతగులుతోందన్నది తాజా వాదన..

తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ.. పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి విస్తారంగా మత్తుపదార్థాలు వచ్చిపడుతున్నాయిన టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారాలపై మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గంజాయి నిర్మూలన విషయంలో ఏపీ సహా పొరుగు రాష్ట్రాలు సహకరించకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ సరఫరాను కూడా అడ్డుకోవాలని, దేశ సరిహద్దులతోపాటు ఎయిర్ పోర్టులు, నేవీ పోర్టుల్లో గట్టి నిఘా ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

డ్రగ్స్ విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు ఏపీలో కాకపుట్టించాయి. ఓవైపు జగన్ సర్కారు కూడా డ్రగ్స్, గంజాయిలపై అలుపెరుగని పోరాటం చేస్తోంటే, సహకరించాల్సి పోయి, ఏపీపైనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామనడం ఎంతవకు సమంజసం?అని వైసీపీ వర్గాల నుంచి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటేనే డ్రగ్స్ వెల్లువకు అడ్డుకట్ట పడుతుందే తప్ప ఫిర్యాదులు, దెప్పిపొడుపులతో కాదని కామెంట్లు వస్తున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, CM KCR, Drugs case, Drugs racket, Ganja case, Srinivas goud, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు