బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు బ్యాంక్ నుంచి భారీ షాక్...

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు జారీ చేసింది. రూ.124.39 కోట్లు బకాయిలు చెల్లించనందున ఆస్తులు జప్తు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.

news18-telugu
Updated: February 7, 2020, 4:23 PM IST
బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు బ్యాంక్ నుంచి భారీ షాక్...
శ్రీభరత్
  • Share this:
నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌కు కరూర్ వైశ్యాబ్యాంక్ నోటీసులు జారీ చేసింది. రూ.124.39 కోట్ల బకాయిలు చెల్లించనందున ఆస్తులు జప్తు చేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. గీతం యూనివర్సిటీ, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ కుటుంబం గతంలో హైదరాబాద్‌ అబిడ్స్‌లోని కరూర్ వైశ్యా బ్యాంక్‌లో విశాఖపట్నంలోని గాజువాక, భీమిలిలోని మరికొన్ని భూములను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంది. అయితే, ఆ రుణాలు చెల్లించాలని బ్యాంక్ నుంచి ఎన్నిసార్లు నోటీసులు పంపినా రుణగ్రహీత స్పందించకపోవడంతో ఇప్పుడు ఆస్తులు జప్తు చేస్తామంటూ నోటీసులు పంపింది.

Ap cm ys jagan, nandamuri balakrishna, nara lokesh, sribharath, ap news, ఏపీ సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్, శ్రీభరత్, ఏపీ న్యూస్
బాలకృష్ణ, శ్రీభరత్

శ్రీభరత్ కుటుంబం ఆంధ్రాబ్యాంక్‌కు రూ.13 కోట్ల బకాయి పడ్డారని, త్వరలోనే ఆయన ఆస్తులను బ్యాంక్ అధికారులు వేలం వేస్తారని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను శ్రీభరత్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ట్రాన్స్‌కో నుంచి తమకు రూ.3కోట్లు బకాయిలు ఉన్నాయని, తాము ఆంధ్రాబ్యాంక్‌కు రూ.2కోట్లు మాత్రమే బకాయి ఉన్నామని చెప్పారు. తమకు ట్రాన్స్ కో నుంచి రావాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఆంధ్రాబ్యాంక్ రుణాలను వెంటనే చెల్లించేవారిమని చెప్పారు.

శ్రీభరత్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది వ్యాపారస్తులకు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించలేదని, ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇక విజయసాయిరెడ్డి సలహాలు సూచనలు రాష్ట్రానికి చాలా అవసరమని తనకు వ్యక్తిగతంగా సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదని నా అభిప్రాయం అంటూ శ్రీ భరత్ చాలా మర్యాదగా చురకలంటించారు. మీకు వీలైతే ఔత్సాహిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి కానీ ఇలా అవమానించకండి అంటూ బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ విజయ సాయి రెడ్డి చేసిన ట్వీట్ కు సమాధానమిచ్చారు.

Balakrishna Nandamuri Son in law Sri Bharat Interesting comments on his wife Tejaswini and Brahmani Nara pk అభిమానులకు కూడా చాలా సార్లు వచ్చిన అనుమానం ఇది. బాలయ్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కానీ ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు. వాళ్లెందుకు రాలేదంటే బాలయ్యకు ఇష్టం లేదేమో.. balakrishna,balakrishna nandamuri,balakrishna daughters,balakrishna brahmani nara,balakrishna tejaswini,balakrishna movies,balakrishna son in law sri bharat,balakrishna daughters movies,telugu cinema,nara brahmani photos,tejaswini photos,బాలకృష్ణ,బాలకృష్ణ కూతుళ్లు,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ శ్రీ భరత్,బాలకృష్ణ బ్రాహ్మణి,బాలకృష్ణ తేజస్విని,తెలుగు సినిమా
భార్య తేజస్వినితో భరత్ (Source: Twitter)

బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్వినిని గీతం విద్యాసంస్థల అధినేత అయిన మూర్తి మనవడు శ్రీ భరత్‌కు ఇచ్చి వివాహం చేశారు. 2019 ఎన్నికల్లో శ్రీభరత్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ, వైసీపీ చేతిలో ఓడిపోయి రెండోస్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ రూపంలో గట్టి పోటీ ఉంటుందని భావించినా, బాలయ్య సోదరి పురందేశ్వరి కూడా బీజేపీ తరఫున బరిలో నిలిచినా కూడా శ్రీభరత్ రెండో స్థానంలో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Balakrishna Nandamuri Son in law Sri Bharat Interesting comments on his wife Tejaswini and Brahmani Nara pk అభిమానులకు కూడా చాలా సార్లు వచ్చిన అనుమానం ఇది. బాలయ్యకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కానీ ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు. వాళ్లెందుకు రాలేదంటే బాలయ్యకు ఇష్టం లేదేమో.. balakrishna,balakrishna nandamuri,balakrishna daughters,balakrishna brahmani nara,balakrishna tejaswini,balakrishna movies,balakrishna son in law sri bharat,balakrishna daughters movies,telugu cinema,nara brahmani photos,tejaswini photos,బాలకృష్ణ,బాలకృష్ణ కూతుళ్లు,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ శ్రీ భరత్,బాలకృష్ణ బ్రాహ్మణి,బాలకృష్ణ తేజస్విని,తెలుగు సినిమా
భార్య తేజస్వినితో భరత్ (Source: Twitter)

మరోవైపు శ్రీభరత్‌కు అమరావతి చుట్టుపక్కల జగ్గయ్యపేట వద్ద భూములు ఉన్నాయంటూ జగన్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అయితే, అవి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే తమకు కేటాయించారని, 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకాకముందే ఉన్నాయని శ్రీ భరత్ వాదించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీల మధ్య వివాదం నడిచింది.

స్వామి స్వరూపానందకు అమరావతిలో నిరసన సెగ...

Published by: Ashok Kumar Bonepalli
First published: February 7, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading