హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Karthika Masam: కళ్లు తెరిచి భక్తులను చూస్తున్న లక్ష్మీదేవి.. కార్తీక మాసాన అమ్మవారి మహిమ అంటూ ప్రత్యేక పూజలు

Karthika Masam: కళ్లు తెరిచి భక్తులను చూస్తున్న లక్ష్మీదేవి.. కార్తీక మాసాన అమ్మవారి మహిమ అంటూ ప్రత్యేక పూజలు

కళ్లు తెరిచిన లక్ష్మీ దేవి

కళ్లు తెరిచిన లక్ష్మీ దేవి

Karthika Masam: చాలామంది దేవుడి మహిమను నమ్ముతుంటారు.. కొన్ని ఘటనలు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది అంటున్నారు భక్తులు.. అమ్మవారు కళ్లు తెరిరి తమను ఆశీర్వదిస్తున్నారంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోట అందరికి తెలియడం భక్తులు బారులు తీరుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • East Godavari, India

Karthika Masam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అప్పుడప్పుడు అద్భుతాలు అంటూ కొన్ని వీడియోలు.. ఫోటోలు వైరల్ (Viral videos and Photos) అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటివి అన్నా దేవుడి మహిమలే అని అంతా నమ్ముతారు.. ప్రత్యేక పూజలు చేస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. విగ్రహం పాలు తగడం.. పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం.. ఆంజనేయుడు కళ్లు తెరవడం.. కొబ్బరి కాయ వినాయకుడి రూపంలోఉండడం.. రాముడు కన్నీరు కార్చడం.. ఇలా నిత్యం వీటి గురించి వింటూ ఉంటాం.. కానీ దీనికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు.. వింత ఘటనలుగానే మిగిలి పోతున్నాయి. ఎందుకంటే హిందువుల్లో ఎక్కువమంది దేవుళ్లకు మహిమలు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు. వారి నమ్మకాలను ఇలాంటి ఘటనలు నిజమే అనేలా చేస్తున్నాయి.

తాజాగా పవిత్ర కార్తీక మాసం (Karithika Masam) వేళ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిలా (East Godavari District) ల్లో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి (Lord Lakshmi mata) అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది. సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లుగాని, సగం మాత్రమే తెరిచి ఉన్న ట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారి కళ్లు సడెన్ గా తెరుచుకోవడం ఇదంతా దేవి మహిమే అంటున్నారు.

Lakshmi Mata Open eyes || పవిత్ర కార్తీక మాసాన.. కళ్లు తెరిచి భక్తులను చ... https://t.co/6kxOyxiMYm via @YouTube #karthikapournami #lakshmi #LordShiva #HindusUnderAttack #Hindutva #HinduRashtra #AndhraPradesh #Andhra

ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. నిన్న ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సనాతన హిందూ ధర్మానికి నెలవు భారత దేశం. దేవుళ్ళనే కాదు.. ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం. దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు. తాజాగా కడియం మండలంలో అదే జరిగింది.

ఇదీ చదవండి : కాంతారాను దింపేసిన తహసీల్దార్.. అద్భుత నృత్యానికి అధికారులు ఫిదా.. వీడియో చూడండి

ఈ వార్త క్షణాల్లో దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు. కళ్లుతెరిచి దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, East godavari, Kartika masam

ఉత్తమ కథలు