• HOME
 • »
 • NEWS
 • »
 • ANDHRA-PRADESH
 • »
 • KARANAM BALARAM AND AMANCHI KRISHNA MOHAN FRACTIONS FIGHT IN PRAKASAM DISTRICT BA

మళ్లీ కొట్టుకున్న వైసీపీ నేతలు.. ఈ సారి ఇంకా గట్టిగా, తలలు పగలగొట్టుకుని

మళ్లీ కొట్టుకున్న వైసీపీ నేతలు.. ఈ సారి ఇంకా గట్టిగా, తలలు పగలగొట్టుకుని

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ అనుచరులపై కరణం బలరాం వర్గం దాడి చేసింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ అనుచరులపై కరణం బలరాం వర్గం దాడి చేసింది. ఐలవల , బల్ల వల మత్స్యకారుల గొడవ ఆమంచి కృష్ణమోహన్, బలరం వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. గొడవను సర్దుబాటు చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఎదుటే వారు కొట్టుకున్నారు. కరణం వర్గీయుల దాడిలో ఆమంచి వర్గానికి చెందిన వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ బజ్జి బాబుకు గాయాలు అయ్యాయి. ఆమంచి సోదరుడు స్వాములు కారును కరణం అనుచరులు చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. ఇరువర్గాల పరస్పర దాడుల్లో పోలీసు వాహనం ధ్వంసమైంది. ఘర్షణలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

  కరోనా పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్... వెబ్‌లో అక్షింతలు, అతిథుల ఇంటికే వివాహ భోజనం

  ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

  Niharika Marriage: ఉదయ్ పూర్ కోటలో మహారాణిలా పెళ్లి చేసుకోవడానికి ఎంత ఖర్చవుతుంది?

  ఐల వల, బల్ల వలల వాడకంపై కొన్నాళ్లుగా ప్రకాశం జిల్లా వాడరేవు, కఠారిపాలెం గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. సముద్రంలోనూ, బయట ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో రెండు వలలతో వేటపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల పరస్పర దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు మాజీ మత్స్యశాఖ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ అయిన మోపిదేవి వెంకటరమణ చీరాల వెళ్లారు. ఈ సందర్భంగా కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య విబేధాలు బయటపడ్డాయి.

  Karanam Balaram vs Amanchi Krishna Mohan, Chirala MLA Karanam Balaram vs YSRCP Ex MLA Amanchi Krishna Mohan, Amanchi vs Karanam fight, కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం,
  ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరామ కృష్ణమూర్తి (Images : Facebook)


  మోపిదేవి వెంట ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం చీరాల ఐకాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఆమంచి వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి లోనికి రానివ్వకుండా కరణం బలరాం వర్గం అడ్డుకుంది. తమపై దాడి చేయించిన ఆమంచిని ఆస్పత్రికి తీసుకొస్తారంటూ వాడరేకు చెందిన మత్స్యకార మహిళలు మోపిదేవిని నిలదీశారు. ఈ సందర్భంగా వారిని శాంతింపజేసేందుకు మోపిదేవి ప్రయత్నించారు. అయినా వారు శాంతించలేదు. ఈ క్రమంలో గొడవ మరింత పెరిగింది. ఇరు వర్గాల పరస్పరం దాడులు చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

  విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం

  ఈ మేక పేరు ‘మోదీ’, ఆ తర్వాత కథ చదవండి..

  Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు

  ‘పెద్ద పెద్ద కర్రలు, ఇనుప రాడ్లు ఉన్నాయి. మా తప్పు లేకుండానే కొట్టారు. కరణం వెంకటేష్ మనుషులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారని అడిగినందుకు మరో కారులో ఉన్నవారు మమ్మల్ని కొట్టారు.’ అని ఆమంచి వర్గం చెప్పింది. ఘర్షణ అనంతరం మత్స్యకారులతో మాజీ మంత్రి మోపిదేవి సమావేశం అయ్యారు. ఇది చాలా చిన్న విషయమని, అనుకోకుండా ఆవేశాలకు లోనై తొందరపాటు చర్య వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందన్నారు. మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం జగన్ ముందుంటారన్నారు. జగన్ ఆదేశాలతో ఇక్కడ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. బల్ల వలలపై అధికారులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: